పచ్చిమిర్చి.. ఇది ప్ర‌తి ఒక్క‌రి ఇంట్లో ఉంటుంది. నిత్యం వంటకాల్లో వాడే ప‌చ్చిమిర్చిని కారంగా ఉంటుంది, తినలేమంటూ పక్కన పడేస్తుంటారు. కానీ, ప‌చ్చిమిర్చి వ‌ల్ల క‌లిగే ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు తెలిస్తే.. ఘాటెత్తే పచ్చిమిర్చిని ఇష్టంగా లాగించేస్తారు. పచ్చి మిరపకాయల్లో రోగ నిరోధక శక్తిని పెంచే విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. అలాగే పచ్చిమిర్చిలో విటమిన్ ఎ, బి, సి మరియు కొంత ఇనుము కూడా ఉంటాయని చెబుతారు. విటమిన్ ఎ కళ్ళకు మంచిది.

IHG

అంతేకాకుండా.. శరీరానికి పోషణ అందించే విటమిన్ బి6, కాపర్, పొటాషియం, నియాసిన్, ఫైబర్, ఫోలేట్ వంటి పోషకాలు ప‌చ్చిమిర్చిలో సమృద్దిగా ఉంటాయి. ప‌చ్చిమిర్చిలో మ‌రో గొప్ప గుణం ఏంటంటే.. బరువు ఎక్కువగా ఉన్నవారు మిర్చిని తమ డైట్‌లో భాగం చేసుకోవడం వల్ల డయాబెటీస్ దరిచేరకుండా ఉంటుందట. ఎందుకుంటే, పచ్చిమిర్చిలోని ప్రత్యేక గుణాలు ఇన్సులిన్ ఉత్పత్తిని సక్రమంగా ఉంచుతాయి. ఈ కారణంగా రెగ్యులర్‌గా పచ్చిమిర్చిని తీసుకోమని చెబుతున్నారు నిపుణులు. ఇటీవ‌ల కాలంలో షుగర్ వ్యాధిగ్రస్తులు రోజురోజుకీ పెరిగిపోతున్న సంగ‌తి తెలిసిందే.

IHG

 చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా అందరికీ ఈ మాయదారి రోగం వచ్చేస్తుంది. ఇది ఒక‌సారి వ‌చ్చిందంటే అస్స‌లు పోదు. అయితే పచ్చిమిర్చిని తిన్న తర్వాత శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తి అయి రక్తంలో డయాబెటీస్ లెవల్స్ అరవై వాతం తగ్గుతాయని అంటున్నారు నిపుణులు. అంతేకాదు పచ్చిమిర్చి శరీరంలో రక్తప్రసరణను కూడా సక్రమంగా ఉంచడంతో పాటు గుండెపోటు రాకుండా నివారిస్తుంది. అలాగే పచ్చిమిర్చి తనలో ఉండే యాంటీ బాక్టీరియల్ గుణాలతో చర్మ సమస్యల్ని పోగొడుతుంది. మ‌రియు పచ్చి మిర్చి తిన‌డం వ‌ల్ల జీర్ణశక్తిని పెంచుతుంది. అజీర్తిని తొలగిస్తుంది. పక్షవాతాన్ని తగ్గిస్తుంది.

 
 
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: