తెలుగు రాష్ట్రాల‌ను క‌రోనా వైర‌స్ అల్లాడిస్తోంది. రోజుకు వంద‌ల సంఖ్య‌లో కేసులు న‌మోద‌వుతున్నాయి. అయితే తెలంగాణ‌లో ఉధృతి ఎక్కువ‌గా ఉంటోంది. గ‌త మూడు రోజులుగా 1800పైచిలుకుగా కేసుల న‌మోదు జ‌రుగుతోంది. అదే స‌మ‌యంలో ఆంధ్రాలో 1వెయ్యి పైచిలుకు కేసులు న‌మోద‌వుతున్నాయి. రెండు రాష్ట్రాల మ‌ధ్య ఒక భిన్న‌త్వం ఉంది. వాస్త‌వానికి తెలంగాణ‌లో ప్ర‌భుత్వం అధికారికంగా ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ జ‌రిపించ‌డం లేదు. కేవ‌లం అనుమానిత ల‌క్ష‌ణాలున్న వారికే చేస్తోంది. క‌రోనాతో ఏం కాదు అనే మొండి ధైర్యాన్ని ప్ర‌జ‌ల‌కు నూరిపోసే ప్ర‌య‌త్నాన్ని చేస్తుంద‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు. 

 

ఇదిలా ఉండ‌గా కరోనా పరీక్షల్లో ఏపీ సరికొత్త రికార్డు సృష్టించింది. రాష్ట్రవ్యాప్తంగా కరోనా పరీక్షల సంఖ్య 10 లక్షలు దాటాయి. ఇప్పటి వరకు ఏపీలో 10,17,123 మందికి కోవిడ్ పరీక్షలు చేశారు. ప్రస్తుతం ఏపీ వ్యాప్తంగా 78 చోట్ల కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఫిబ్రవరి 1న గాంధీ ఆసుపత్రికి ఏపీ నుంచి తొలి శాంపిల్ పంపించారు. అనంతరం మార్చి7న తిరుపతి స్విమ్స్‌లో తొలి కరోనా పరీక్షలు నిర్వహించారు. ఏపీలో ప్రతి 10 లక్షల మందిలో 19,047 మందికి పరీక్షలు చేశారు. ఇది దేశంలోనే అత్యధికం. జాతీయ స్థాయిలో ప్రతి 10 లక్షల మందికి కేవలం 6,578 మందికి మాత్రమే టెస్టులు చేశారు. 


మరణాల రేటులోనూ ఏపీ అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఇక్కడ 1.24 శాతంగా ఉండగా.. జాతీయ స్థాయిలో సగటు రేటు 2.89 శాతంగా ఉండ‌టం. అదే స‌మ‌యంలో తెలంగాణ రాష్ట్రం ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ‌లో అట్ట‌డుగు స్థానాల్లో ఉండ‌టం గ‌మ‌నార్హం.  హైకోర్టు సైతం రిట్ పిటిష‌న్ల‌ను స్వీక‌రించి విచార‌ణ‌లో భాగంగా ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ‌కు ఎందుకు చ‌ర్య‌లు తీసుకోవ‌డం లేదో వివ‌రించాల‌ని ప్ర‌శ్నించినా స‌రైన స్పంద‌న లేక‌పోవ‌డం గ‌మ‌నార్హం. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో నిత్య వేలాది మందికి ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తున్నారు. అక్క‌డ నిత్యం 20 నుంచి 23వేల మందికి ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తున్నారు. ఇక డోర్ టుడోర్ ప‌రీక్ష‌ల‌కు కూడా జ‌గ‌న్ ప్ర‌భుత్వం ఆదేశాలు జారీ చేసింది. అయితే తెలంగాణ‌లో ప‌రీక్ష చేయించుకున్న ప్ర‌తీ 5ఐదుగురిలో ఒక‌రికి పాజిటివ్ రావ‌డం గ‌మ‌నార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: