పానీపూరి అంటే నోరూరని వారు ఎవరూ ఉండరు. మహమ్మారి వైరస్ రాకతో పానీపూరి ప్రియులకు పానీపూరి దొరక్క నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. స్విగ్గి, జొమాటోలు స్టార్ట్ అయిన గాని వాటిలో పానీపూరి ఉండదు. వైరస్ కారణంగా చాలామంది పానీపూరి ప్రియులు రోడ్డుపై ఉన్న పానీపూరి తినడానికి తెగ భయపడుతున్నారు. దీంతో ఎప్పుడెప్పుడా వైరస్ మహమ్మారి అంతమవుతుందా.. ?ఎప్పుడెప్పుడా పానీ పూరి తిందామా అని వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు ప్రజలు. అలా ఎదురుచూసే పానీపూరి లవర్స్ కి ఓ పానీ పూరి యంత్రం పుట్టుకొచ్చింది. పదవ తరగతి పాస్ అయిన ఓ వ్యక్తి తన తెలివితేటలను ఉపయోగించి వెరైటీగా పానీపూరి ఏటీఎం అనే దాన్ని తయారు చేశాడు.

IHG'Pani <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=PURI JAGANNADH' target='_blank' title='puri-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>puri</a> ATM' is creating buzz on internet

ఈ యంత్రం పని చేసే విధానం ఎలా అంటే… అందులో డబ్బులు వేసాము అంటే మన ఫేవరెట్ పానీ పూరి ఫుడ్ తినవచ్చు. ఆ వ్యక్తి పేరు భరత్ బాయ్ వికారాబాయ్ ప్రజాపతి. గుజరాత్ రాష్ట్రానికి చెందిన వాడు. తాను తయారు చేసిన ఆ పానీ పూరి ఎటిఎం కస్టమర్ డబ్బులు వేస్తే ఎలా వస్తాయి అనేదాన్ని వివరించి సోషల్ మీడియాలో వీడియో రిలీజ్ చేయడం జరిగింది. అచ్చం ఏటీఎం మిషన్ లాగే ఉంటుంది. మొదట స్టార్ట్ బటన్ నొక్కాలి.

IHG

ఆ తర్వాత ఎన్ని డబ్బులతో పానీపూరి తింటారో అంత డబ్బును కింద ఇచ్చిన స్లాట్ లో కరెన్సీ నోటు పెట్టాలి. మిషన్ కరెన్సీ నోట్లను స్కాన్ చేసి డబ్బులు ఎంతో లెక్కిస్తుంది. ఆ తర్వాత ఎంటర్ బటన్ నొక్కాలి. ఆ తరువాత పానీపూరి బయటకు వస్తుంది. ఒక్కొక్కటిగా వస్తున్న పానీపూరి కస్టమర్ తీసుకుని తినేయవచ్చు. దీంతో వైరస్ రాకతో పానీపూరి పై బెంగ పడినవారు ఈ మిషన్ వల్ల వైరస్ బారి నుండి తప్పించుకుని ఆహ్లాదంగా పానీ పూరి లాగించేయొచ్చు. 

మరింత సమాచారం తెలుసుకోండి: