ఆటిజం.. ఈ సమ‌స్య కేవ‌లం మ‌న‌ద‌గ్గ‌రే కాదు.. ప్ర‌పంచ వ్యాప్తంగా అనేక దేశాల్లో.. కోట్లాది మంది చిన్నారు ల జీవితాల‌ను చిదిమేస్తోంది! బుద్ధిమాంద్యంగా పేర్కొనే ఈ స‌మ‌స్య కార‌ణంగా.. త‌మ చిన్నారుల ఎదుగు ద‌ల‌తోపాటు మెద‌డు, ప‌రిజ్ఞానం.. వంటివి ఎద‌గ‌క‌పోవ‌డం ఎన్నో ఆశ‌లు పెట్టుకుని క‌ల‌లు క‌న్న వారి తల్లి దండ్రుల‌కు గ‌ర్భ‌శోకాన్ని మిగిలిస్తున్న అరుదైన ప‌రిస్థితి! ఆటిజం చిన్నారుల‌కు అన్ని అవ‌య‌వాలూ బా గానే ఉంటాయి. కానీ, వారిలో గుర్తింపు చిహ్నాలు ఉండ‌వు. సాధార‌ణ చిన్నారుల్లాగా వారు ప్ర‌వ‌ర్తించ‌లేరు. దీంతో వారు శారీర‌కంగా ఎదుగుతున్నా.. మాన‌సికంగా మాత్రం ప‌రివ‌ర్త‌న చెందే అవ‌కాశం ఉండ‌దు.

 

దీంతో వారికి అన్ని విధాలా క‌నిపెట్టుకుని ఉండాల్సిన అవ‌స‌రం ఉంటుంది. ఇది ఎప్ప‌టి వ‌ర‌కు ? అనే ప్ర‌శ్న‌కు.. స‌మాధానం లేదు. వ‌య‌సు పెరుగుతుంది.. దాంతో పాటు శ‌రీరం కూడా వృద్ధి చెందుతుంది. కానీ, వారి ప్ర‌వ‌ర్త‌న మాత్రం వృద్ది చెంద‌దు. నోటి నుంచి చొంగ‌కార‌డం, మాట‌లు ప‌ల‌క‌లేక పోవ‌డం, గుర్తింపు చిహ్నాలూ లేక పోవ‌డం, త‌మ చుట్టూ ఉన్న ప‌రిస్థితుల‌పై కూడా క‌నీసం అవగాహ‌న లేక‌పోవ‌డం వంటివి ప్ర‌ధాన స‌మ‌స్య‌. ఇలాంటి ప‌రిస్థితిలో ఉన్న చిన్నారుల‌ను ఎలా సాధార‌ణ స్థితికి తీసుకురావాలి?  ఎన్నో ఆశ‌లు పెట్టుకున్న త‌ల్లిదండ్రుల‌కు ఇది ప్ర‌ధాన ప్ర‌శ్న‌. అంతేకాదు.. మ‌రో వేద‌న కూడా!

 

కొన్ని ద‌శాబ్దాల పాటు ఈ స‌మ‌స్య అలానే ఉండిపోయింది. ఎవ‌రో డ‌బ్బున్న మ‌హ‌రాజుల బిడ్డ‌ల‌కు ఈ స‌మ‌స్య వ‌స్తే.. దేశ‌దేశాలు తిరిగి.. త‌ల‌కో చోట ఉన్న చికిత్స‌ల‌ను అందిపుచ్చుకుని న‌యం చేయించుకు నేవారు. మ‌రి మిగిలిన వారి కుటుంబాల్లో ఇలాంటి ప‌రిస్థితి ఎదురైతే.. ఏం చేయాలి?  ``దేవుడా?! ఏంటి మా ప‌రిస్థితి?`` అని చేతులెత్తి మొక్కి.. క‌ళ్ల వ‌త్తుకోవాల్సిందేనా?! .. కాదు!! ఇప్పుడు ఇలాంటి స‌మ‌స్య‌ల‌కు `మేమున్నాం` అని భ‌రోసా ఇస్తోంది.. `పినాకిల్ బ్లూమ్స్‌` సంస్థ. ప్ర‌ఖ్యాత టెకీగా గుర్తింపు పొందిన స‌రిప‌ల్లి కోటిరెడ్డి కుటుంబంలోనే ఈ స‌మ‌స్య ఎదురైంది.

 

కోటిరెడ్డి వార‌సుడికే ఆటిజం స‌మ‌స్య ఎదురైంది. దీంతో ఆ దంప‌తులు.. అనేక వ్య‌య ప్ర‌యాస‌ల‌కు ఓర్చు కుని.. దేశ‌దేశాలు తిరిగి.. త‌మ కుమారుడికి న‌యం చేయించుకునేందుకు ప్ర‌య‌త్నించారు. ఈ క్ర‌మంలో స‌రిప‌ల్లి దంప‌తుల మ‌దిలో.. `స‌మాజం` అనే బాధ్య‌త స్ఫురించింది. ``మ‌నలాగే ఈ దేశంలో ఈ రాష్ట్రం లో కొన్ని ల‌క్ష‌ల మంది త‌ల్లిదండ్రులు త‌మ పిల్ల‌లకు ఆటిజం రావ‌డంతో తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్నా రు క‌దా! మ‌నం ఎలాగూ ఈ స‌మ‌స్య ప‌రిష్కారానికి దారిని క‌నుగొన్నాం.. వారికి కూడా ఉప‌యోగ‌ప‌డేలా దీని ని మ‌లిస్తే.. బాగుంటుంది క‌దా!``అని భావించారు. వీరు క‌న్న క‌ల‌ల‌కు ప్ర‌తిరూపంగా ఏర్ప‌డిందే.. పినాకిల్ బ్లూమ్స్‌!

 

ఎక్క‌డెక్క‌డో ఉన్న ఆటిజం స‌మ‌స్య ప‌రిష్కారాల‌ను, చికిత్స‌ల‌ను.. ఒకే వేదిక‌పైకి తీసుకువ‌చ్చారు. ఎన్నో ల‌క్ష‌ల రూపాయ‌లు ఖ‌ర్చు చేస్తేనే కానీ.. ల‌భించ‌ని వైద్యాన్ని త‌క్కువ వ్య‌యానికి అందించే ఏర్పాటు చేశారు. స‌రిప‌ల్లి ఫ్యామిలీ వెలుగులోకి తెచ్చి.. చిన్నారుల జీవితాల్లో పున్న‌ములు ప్ర‌సాదించేందుకు న‌డుం బిగించిన సంస్థే.. పినాకిల్ బ్లూమ్స్‌. ఆటిజం, స్పీచ్ సమస్యలు, ఆక్యుపేషనల్, మానసిక వత్తిడి, చదువు, రాయడంలో ఇబ్బందులు...ఇలా అన్ని స‌మ‌స్య‌ల‌కు ఒకే చోట ప‌రిష్కారం ల‌భించేలా పినాకిల్ బ్లూమ్స్ తీర్చిదిద్దారు. స్వ‌చ్ఛంద సేవ‌లో భాగంగా దీనిని ప్రపంచ వ్యాప్తం చేశారు.

 

ప్ర‌స్తుతం హైద‌రాబాద్‌లో అనేక సంస్థ‌ల‌ను ఏర్పాటు చేసి... చిన్నారుల జీవితాల‌ను పండిస్తున్నారు. ప్ర‌స్తుతం  ప్రపంచ వ్యాప్తంగా 80 కోట్ల మందికి పైగా వున్న న్యూరోలాజికల్(నాడి) , మానసిక రుగ్మతలతో బాధ పడుతున్న వారిని.. ఈ సంస్థ‌లో అంకిత భావంతో అందిస్తున్న సేవ‌ల ద్వారా తీర్చిదిద్దుతున్నారు. ఎవ్వరిమీద ఆధారపడకుండా తమంతట తాము జీవితాన్ని ఏర్పరచుకునేలా వారి జీవితాలలో, వారి కుటుంబాలలో వెలుగులు నింపడమే ధ్యేయంగా పినాకిల్ బ్లూమ్స్ సంస్థ‌ద్వారా సేవలు చేస్తున్నారు. నిజానికి ప్ర‌భుత్వాలు సైతం చేయ‌లేక చేతులు ఎత్తేసిన స‌మ‌స్య ప‌రిష్కారానికి స‌రిప‌ల్లి కుటుంబం న‌డుం బిగించ‌డం న‌భూతో.. అని చెప్ప‌క‌త‌ప్ప‌దు!!

 

మరింత సమాచారం తెలుసుకోండి: