అనుకున్న‌ట్లుగా వ్యాక్సిన్ సిద్ధం కాకుంటే..క‌రోనా నియంత్ర‌ణ‌లోకి రాకుంటే ఏం జ‌రుగుతుంది మాన‌వాళికి మ‌హా ఉప‌ద్ర‌వం త‌ప్ప‌ద‌ని తెలుస్తోంది. ఏం జ‌ర‌గ‌బోతోందంటే క‌నీవినీ విల‌యం త‌ప్ప‌ద‌ని ఓ స‌ర్వే నివేదిస్తోంది. శాస్త్రీయ దృక్ప‌థంతో సాగిన ఈ స‌ర్వే ఇప్పుడు నిజంగానే వ‌ణుకు పుట్టిస్తోంది. 2021 మార్చి వరకు ప్రపంచంలో 25 కోట్లకు పైగా కరోనా కేసులు నమోదవుతాయని, 18 లక్షలకు పైగా మరణాలు సంభవిస్తాయని సర్వేలో తేలింది.  ఇప్పుడు నమోదవుతున్న కేసుల కంటే 10 నుంచి 12 రేట్లు కేసులు అధికంగా నమోదయ్యే అవకాశం ఉన్నట్టుగా ఎంఐటి తెలిపింది.  ఇండియాలో రోజుకు 2.8 లక్షల కేసులు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని ఎంఐటి అంచనా వేస్తోంది.  ఎంఐటి సర్వే ఇప్పుడు వైరల్ అవుతున్నది

 


అమెరికా, బ్రెజిల్, ఇండియాలోనే అత్యధిక కేసులు నమోదవుతున్నాయి. మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ అఫ్ టెక్నాలజీ కరోనా కేసుల నమోదుపై సర్వే నిర్వహించింది.  ఈ సర్వేలో అనేక విషయాలు వెలుగుచూశాయి.  2021 మార్చి వరకు ప్రపంచంలో 25 కోట్లకు పైగా కరోనా కేసులు నమోదవుతాయని, 18 లక్షలకు పైగా మరణాలు సంభవిస్తాయని సర్వేలో తేలింది. గ‌తంలో క‌న్నా రోజు రోజుకు ఇండియాలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతూ పోతున్నాయి. ఈ సంఖ్య మ‌రో వారం ప‌దిరోజుల్లో మ‌రింత అధికంగా మారుతుంద‌న్న అభిప్రాయాన్ని వైద్య వ‌ర్గాలు వెల్ల‌డిస్తున్నాయి. గతంలో కన్నా కరోనా టెస్టులు ఇండియాలో అధికంగా చేస్తున్నారు.  రోజుకు రెండు లక్షలకు పైగా టెస్టులు చేస్తుండగా, 20 నుంచి 23 వేల వరకు కేసులు నమోదవుతున్నాయి. 

 

అటు ప్రపంచంలో కూడా కేసులు భారీ స్థాయిలో  నమోదవుతుండటం ఆందోళన కలిగిస్తోంది.  ఇప్పటికే ప్రపంచం మొత్తం మీద 1.12 కోట్లకు పైగా కేసులు నమోదయ్యాయి.  ఐదు లక్షలకు పైగా మరణాలు సంభవించాయి.   ఇప్పుడు నమోదవుతున్న కేసుల కంటే 10 నుంచి 12 రేట్లు కేసులు అధికంగా నమోదయ్యే అవకాశం ఉన్నట్టుగా ఎంఐటి తెలిపింది.  ఇండియాలో రోజుకు 2.8 లక్షల కేసులు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని ఎంఐటి అంచనా వేస్తోంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: