నిద్ర‌.. ఇది లేనిదే మ‌నం ఉండ‌ము. ముఖ్యంగా మానవ జీవితంలో నిద్ర ప్రాథమిక అవసరమని, శారీరకపరంగా అత్యంత ముఖ్యమైనదని తెలిసిందే. ఆరు గంటల కంటే తక్కువగా నిద్రపోవడాన్ని తక్కువ నిద్ర అంటారు. పది గంటల కన్నా ఎక్కువ నిద్రపోవడాన్ని ఎక్కువ నిద్ర అంటారు. ఈ రెండూ ఆరోగ్యానికి మంచివి కావు. అయితే ఆరోగ్యంగా ఉండాలంటే మాత్రం ఖ‌చ్చితంగా ఎనిమిది గంటలు నిద్ర పోవాలి. తిండి తినకుండా ఇర‌వై నుంచి న‌ల‌బై రోజుల వరకు ఉండొచ్చు కానీ నిద్ర పోకుండా మాత్రం ఎక్కువ రోజులు ఉండటం అసాధ్యం.

 

అయితే నిద్ర పోవాలంటే కాదు.. కాదు.. ప్ర‌శాతంగా నిద్రపోవాలంటే మంచం, పరుపు, దుప్పటి, దిండు ఇవే మ‌న‌కు ముందు గుర్తుకువ‌స్తాయి. ముఖ్యంగా దిండు లేనిదే నిద్ర ప‌ట్ట‌డం చాలా క‌ష్ట‌మ‌ని కొంద‌రు భావిస్తున్నారు. కానీ, ఆ దిండు వ‌ల్లే అనేక స‌మ‌స్య‌లు ఎదుర్కోవాల‌ని ఎప్పుడైనా ఆలోచించారా..? అవును! దిండు పెట్టుకోవ‌డం వ‌ల్ల అనేక స‌మ‌స్య‌లు త‌లెత్తుతాయి. వాస్త‌వానికి మనం పడుకున్నప్పుడు మెడ పరుపుకు సమాంతరంగా ఉండాలి. తల కింద దిండు పెట్టుకుంటే మెడ ఎత్తుగా అయినా ఉంటుంది, కిందకైనా ఉంటుంది. దీనివల్ల నెక్ పెయిన్ వస్తుంది. 

 

అలాగే దిండు సరిగ్గా లేకపోతే మాటిమాటికీ మెలకువ రావ‌డం.. సరిగ్గా నిద్ర పట్టకపోవ‌డం.. మర్నాడు రోజంతా చిరాగ్గా ఉండ‌డం జ‌రుగుతుంది. అసలు దిండే పెట్టుకోకపోతే హాయిగా పడుకోవచ్చు. హాయిగా నిద్రపోతే ఒత్తిడి, డిప్రెషన్ సమస్యలు దరిచేరవు. అంతేకాకుండా.. సరైన నిద్ర ఉన్నప్పుడు శరీరంలో మెలటోనిన్, కార్టిసోల్ ఉత్పత్తి స్టెడీ గా ఉంటుంది. అందువల్ల శరీరానికి రకరకాల వ్యాధులతో, కాన్సర్ తో సహా, పోరాడే శక్తి వస్తుంది. అందుకే, దిండు లేకుండా పడుకుంటే మంచిద‌ని అంటున్నారు నిపుణులు. ఇక ఎంత శుభ్రం చేసినా.. మనకి తెలీకుండానే దిండు దిండుకి బ్యాక్టీరియా ఉంటుంది. దీంతో ఒక వైపు తిరిగి పడుకున్నప్పుడు ఆ బాక్టీరియా డైరెక్ట్ గా ముఖం మీదకి ట్రాన్స్ఫర్ అయ్యి.. మొటిమ‌లు లేదా ఇత‌రిత‌ర చ‌ర్మ స‌మ‌స్య‌లు ఎదుక్కోవాల్సి వ‌స్తుంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: