పసి పిల్లల జుట్టు బాగా పెరగడానికి ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ పద్ధతులు పాటించండి...

కొబ్బరి నూనె జుట్టుకు ఎక్కువ పోషణను ఇచ్చే తేలికపాటి నూనెలలో ఒకటి. ఇది తల మీద చర్మంను ఆరోగ్యంగా ఉండేటట్లు చేయడమే కాకుండా జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. కొబ్బరి నూనెతో పిల్లల తలను క్రమం తప్పకుండా మసాజ్ చేయండి. దీనివల్ల వారి జుట్టు ఒత్తుగా, సిల్కీగా చేస్తుంది. మసాజ్ కోసం మీరు కొబ్బరి నూనెకి బదులు ఆముదంను కూడా వాడవచ్చు.

జుట్టు బాగా పెరగడానికి సులభమైన మరియు సహజమైన మార్గం కలబందను ఉపయోగించడం. మీరు మొక్క నుండి తీసిన తాజా కలబందను అయినా లేదా షాపుల్లో కొన్న కలబందను అయినా ఉపయోగించవచ్చు. శిశువు యొక్క తలపై కలబంద జెల్ ను అప్లయ్ చేసి బాగా మసాజ్ చేయండి. 15-20 నిమిషాలు అలాగే ఉంచండి. ఆ తరువాత బాగా కడగండి.

పసిపిల్లలకు తక్కువ జుట్టు ఉండొచ్చు. కానీ, తల మీద రక్త ప్రసరణ బాగా జరగడం కోసం రోజూ దువ్వాలి. సున్నితమైన దువ్వెనను వాడండి. మీ శిశువు జుట్టును నెమ్మదిగా, సున్నితంగా దువ్వండి. ఇలా చేస్తే మీ పిల్లవాడి తల మీద రక్త ప్రసరణ బాగా జరిగి జుట్టు పెరుగుతుంది.

చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లల జుట్టును చిన్న చిన్న పోనీటెయిల్స్‌ లాగా కడతారు. ఇలా వేస్తే వారు చాలా అందంగా కనిపిస్తారనడంలో సందేహం లేదు. పిల్లలు అందంగా కనిపించాలని రెడీ చేస్తారు కానీ ఇలా వారికి జడ వేయడం వలన పిల్లల జుట్టు డామేజ్ అవుతుంది. పిల్లల జుట్టు యొక్క మూలాలు బలహీనంగా ఉంటాయి. మీరు జడ వేయడం వల్ల జుట్టు పాడవుతుంది. అంతేకాక జుట్టు రాలిపోయే అవకాశం కూడా ఉంది.

పిల్లల తల మీద మురికి పేరుకుపోతే తల మీద చర్మం పొడిబారిపోతుంది. ఇది జుట్టు పెరుగుదలను నియంత్రిస్తుంది. మీరు మీ పిల్లలకు రెగ్యులర్ గా తలస్నానం చేయిస్తే తల మీద ఉన్న మురికి పోయి తల మీద చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. దీంతో జుట్టు బాగా పెరుగుతుంది. శుభ్రమైన చర్మం జుట్టు పెరుగుదలను మరింత పెంచుతుంది. మీ శిశువు యొక్క చర్మం యొక్క రకాన్ని బట్టి మీరు మీ శిశువుకు క్రమం తప్పకుండా తలస్నానం చేయించాలి. జుట్టు బాగా పెరగడం కోసం ఏ షాంపూ వాడాలో మీరు వైద్యుడిని సంప్రదించండి.

మరింత సమాచారం తెలుసుకోండి: