చేతులతో ఏదైనా ఉపరితలం కానీ వస్తువును కానీ తాకి, అవే చేతుల్తో తమ ముఖాన్ని తాకడం అనేది వైరస్ వ్యాపించడానికి ప్రధాన కారణం కాదు అని 'సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్' చెప్పింది. అయితే సీడీసీ, ప్రపంచ ఆరోగ్య సంస్థ, ఇతర ఆరోగ్య సంస్థలు అన్నీ కోవిడ్-19 వ్యాప్తిని అడ్డుకోడానికి మనం చేతులు శుభ్రంగా కడుక్కోవడం, తరచూ తాకే ఉపరితలాలను క్రిమి రహితం చేయడం రెండూ ముఖ్యమే అని గట్టిగా చెబుతున్నాయి. కోవిడ్-19 వ్యాధికి కారణమైన సార్స్-CoV-2 అనే ఈ వైరస్ కచ్చితంగా ఎంతకాలం పాటు మనిషి శరీరం బయట ఉంటుంది అనే ఒక్క విషయంపై మాత్రం ఇంకా స్పష్టత రాలేదు. సార్స్, మెర్స్ సహా ఇతర కరోనా వైరస్‌లపై జరిగిన కొన్ని అధ్యయనాల్లో పూర్తిగా క్రిమిరహితం చేయనంతవరకూ అవి లోహం, గ్లాస్, ప్లాస్టిక్ మీద 9 రోజుల వరకూ బ్రతకగలవని వాటిలో కొన్ని బయట కనిష్ట ఉష్ణోగ్రతల్లో 28 రోజుల వరకూ సజీవంగా ఉంటాయని కనుగొన్నారు. తాజాగా మానవ శరీరంపై కరోనా వైరస్ 9 గంటల వరకు మనుగడ సాగించగలదని ఓ పరిశోధనలో వెల్లడయ్యింది.

ఈవిధంగా కరోనా వైరస్ మానవ శరీరంపై 9 గంటల వరకు యాక్టివ్‌గా ఉంటుందని జపాన్ శాస్త్రవేత్తలు తమ పరిశోధనలో గుర్తించారు. సాధారణ ఫ్లూకి కారణమయ్యే వైరస్‌ మానవ చర్మంపై సుమారు 1.8 గంటలు జీవించి ఉంటుందని, దాంతో పోల్చితే ఇది ఐదు రెట్లు ఎక్కువ కాలం జీవిస్తుందని క్లినికల్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ జర్నల్‌లో ప్రచురించిన అధ్యయనం తెలిపింది. ‘మానవ చర్మంపై SARS-CoV-2 (కోవిడ్ -19 కి కారణమయ్యే వైరస్ జాతి) తొమ్మిది గంటల మనుగడ కారణంగా త్వరగా, సులువుగా వైరస్ వ్యాప్తి చెందుతుంది అని తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: