ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ లో జలుబు, దగ్గు కి సంబంధించిన మందుని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకోండి.. సాధారణంగా చాలా మంది జలుబు, దగ్గు సమస్యలతో చాలా బాధ పడుతూ వుంటారు. జలుబు,  దగ్గు కి మంచి అల్లం, తేనె మరియు నిమ్మకాయ చాలా బాగా పనిచేస్తాయి. వాటితో ఇంట్లోనే చాలా సులభంగా  జలుబు, దగ్గు సిరప్ తయారు చేసుకోవచ్చు...

తయారీకి కావలిసిన పదార్థాలు:

అల్లం
 తెనె
 2 నిమ్మకాయలు
 వాటర్
 ఒక కత్తి
ఒక తురుము పీట లేదా జెస్టర్
ఒక సాస్ పాన్
మిక్సింగ్ కోసం స్పూన్
కొలవడానికి మేజరింగ్ కప్పులు మరియు స్పూన్స్
ఒక స్ట్రైనర్ మరియు ఒక గిన్నె
దగ్గు సిరప్ నిల్వ చేయడానికి ఒక జార్.

తయారీ విధానం:


1. మొదట అల్లంను చిన్న చిన్నముక్కలుగా కట్ చెయ్యండి.
2. నిమ్మకాయల రసం తీసి పక్కన పెట్టుకోండి. తరువాత తురుము పీట లేదా జెస్టర్ ఉపయోగించి రసం తీసిన రెండు నిమ్మకాయలను తురమండి.
3. సాస్ పాన్ లో 1 కప్పు నీరు పోయాలి.
4. ఆ నీటిలో పావు కప్పు చిన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలను వెయ్యండి.
5.1½ లేదా 2 టేబుల్ స్పూన్ల తురుముకున్న నిమ్మకాయ తురుమును వెయ్యండి.
6. 5 నిమిషాలు స్టవ్ ను లౌ ఫ్లేమ్ లో పెట్టి ఈ ద్రావణాన్ని మరిగించండి. తరువాత స్టవ్ ఆఫ్ చెయ్యండి.
7. ఈ ద్రావణం చల్లరిన తరువాత వడకట్టి పక్కన పెట్టండి.
8. ఒక సాస్ పాన్ తీసుకుని అందులో ఒక కప్పు తేనెను పోసి లౌ ఫ్లేమ్ లో వేడి చెయ్యండి. కానీ దాన్ని మరగనివ్వద్దు.
9. తేనే వేడి ఎక్కిన తరువాత ఇందాక వడకట్టి పక్కన పెట్టుకున్న ద్రావణాన్ని వేసి కలపండి.
10. తేనెలో అల్లం ద్రావణాన్ని వేసి తిప్పిన తరువాత రెండు నిమ్మకాయల రసాన్ని వెయ్యండి.
11. నిమ్మ రసం వేసిన తరువాత కొన్ని నిముషాలు స్టవ్ లౌ ఫ్లేమ్ లో ఉంచి తిప్పుతూ ఉండండి.
12. తరువాత స్టవ్ ఆఫ్ చేసి దాని ఒక జార్ లో పొయ్యండి. అంతే దగ్గు తగ్గించే సిరప్ రెడీ అయిపొయింది.


తీసుకోవాలిసిన మోతాదు:


*1 నుండి 5 సంవత్సరాల వయస్సు పిల్లలకు ప్రతి 2 గంటలకు అర టీస్పూన్ నుంచి ఒక టీస్పూన్ వరకు వెయ్యవచ్చు.

* 5 నుండి 12 సంవత్సరాల వయస్సు పిల్లలకు ప్రతి 2 గంటలకు 1 నుండి 2 టీస్పూన్లు వెయ్యవచ్చు.

*పెద్దవారు మరియు 12 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న పిల్లలకు ప్రతి 4 గంటలకు 1 నుండి 2 టేబుల్ స్పూన్లు తీసుకోవాలి.

ఇలాంటి మరెన్నో ఆరోగ్యానికి సంబంధించిన ఆర్టికల్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి... 

మరింత సమాచారం తెలుసుకోండి: