ఎన్నో జన్మల పుణ్యఫలం మానవ జన్మ అని అంటుంటారు. మరి అలాంటి మానవ జన్మను సార్థకం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎవరికీ హాని తలపెట్టకపోవటం, సహాయ కార్యక్రమాలు చేయడం, పదిమందిలో గౌరవం పొందేలా జీవించడం, మన మీద ఆధారపడే వారికి ఆసరా ఇవ్వడం అలాగే ఆఖరికి ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా మరణించడం ఇవన్నీ సక్రమంగా చేసేవారి జన్మ నిజంగానే సార్థకం. ప్రధానంగా ఇవన్నీ సక్రమంగా నిర్వర్తించాలంటే ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ప్రాథమిక అవసరం. ఆకలికి ఆహారం ఎంత అవసరమో... దాహానికి నీరు ఎంత అవసరమో... అలాగే శరీరానికి నిద్ర కూడా అంతే అవసరం. నిద్ర సరిగా లేకపోతే పలురకాల సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. ఇటీవల పలు అధ్యయనాలలో... సరిగ్గా నిద్రపోనివారికి ఆయువు తగ్గిపోతుందని వాటి సారాంశం... రోజుకు మనిషి కనీసం 6 నుంచి 8 గంటల వరకు నిద్రపోవాలి. వయోవృద్ధులు, పిల్ల‌లైతే రోజుకు తప్పనిసరిగా 10 గంటలు నిద్రపోవాల్సిందే. కనీసం 6 గంటలైనా నిద్ర లేకపోతే... మనం చేతులారా అనారోగ్య సమస్యలు కొనితెచ్చుకున్నట్లే.

నిద్రలేమి వల్ల కలిగే అనారోగ్య సమస్యలు:

  • # శరీరానికి సరిపడా నిద్ర‌ లేకపోతే 'డిప్రెష‌న్'కు గురువుతారు. ఈ డిప్రెషన్ ఇత‌ర అనారోగ్య స‌మ‌స్య‌ల‌కు కూడా దారి తీసే ప్రమాదం ఉంది.

    # రోజుకు 6 గంటల కన్నా తక్కువ నిద్రపోయేవారు రోజంతా డల్‌గా ఉంటారు. ఉత్సాహంగా ఏ పనికూడా చేయ‌లేరు.

    # నిద్రలేమి సమస్య... మెద‌డుపై తీవ్ర ప్ర‌భావం చూపుతుంది. దీంతో జ్ఞాప‌క‌శ‌క్తితోపాటు... ఆలోచ‌నా శ‌క్తి కూడా త‌గ్గుతుంది. ఇది విద్యార్థులపై తీవ్ర ప్రభావం చూపుతుంది.

    # శ‌రీరానికి స‌రిప‌డా ఆక్సిజ‌న్ ల‌భించ‌దు. దీంతో ఒత్తిడి, ఆందోళ‌న వంటి స‌మస్య‌లు ఎదురవుతాయి. దీని ప్రభావం ఖచ్చితంగా రెండు రోజుల వరకు ఉంటుంది.

    # ఏ పనిమీద ఏకాగ్రత కుదరదు. తద్వారా అనుకున్న పనిని పూర్తిచేయడం కష్టసాధ్యమవుతుంది. ఫలితంగా ఒత్తిడికి గురికావాల్సి వస్తుంది.

    # రోజూ త‌గినన్ని గంట‌లు నిద్రపోకపోతే... ఊబకాయం, బరువు పెరగటం వంటి సమస్యలు ఎదురవుతాయి.

    # స్త్రీ,పురుషుల్లో సెక్స్ కోరికలు త‌గ్గుతాయి. ముఖ్యంగా పురుషుల్లో టెస్టోస్టిరాన్ హార్మోన్ స్థాయిలు త‌గ్గి..సెక్స్ సామ‌ర్థ్యం తగ్గే అవకాశం ఉంది.

    # వృద్ధాప్య ఛాయలు కూడా త్వ‌ర‌గా దరి చేరతాయి. నిద్రలేమి ఎక్కువైతే ఒక్కోసారి ప్రాణానికి కూడా ప్రమాదం ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: