ప్రస్తుత రోజుల్లో ఎక్కువ మంది ఎదుర్కొంటున్న అతి ప్రధాన సమస్య... ఊబకాయం (బరువు పెరగడం). దీని వల్ల కలిగే ప్రయోజనాలు పూర్తిగా శూన్యం కాగా తీవ్రమైన దుష్పరిణామాలు ఎదుర్కొంటున్నారు. వీటన్నింటికీ ప్రధాన కారణం మన బద్దకపు అలవాట్లు, వాటిని తెలుసుకొని సరిదిద్దుకునే ప్రయత్నం చేయండి.

1. రోజుకి ఏడెనిమిది గంటలు నిద్ర పోయేవారికన్నా, అంత నిద్ర ఉండని వారికి పొట్ట చుట్టూ కొవ్వు రెండున్ననర రెట్లు ఎక్కువ పెరుగుతుందట. రోజూ కనీసం ఆరేడు గంటల ప్రశాంతమైన నిద్రని ఆహ్వానించండి.

2. రెగ్యులర్ సోడాల బదులు డైట్ సోడా లు తాగడం వల్ల కూడా బెల్లీ ఫ్యాట్ పెరుగుతుందట. వెయిట్ గెయిన్ లేకుండా కెఫీన్ కిక్ కోసం బ్లాక్ టీ తాగండి.

3. ఫ్యామిలీ మీల్స్, ఫ్రెండ్స్ తో మీల్స్ ఇవి బావుంటాయి కానీ, మనం మనకి తెలియకుండానే ఎక్కువ తినేస్తాం. అందుకని ఫ్రెండ్స్ తో గడిపే సమయాన్ని వాకింగ్, మూవీస్ ఇలా మార్చుకోండి, వారితో కలిసి మీల్స్ చేయకండి. ఫ్యామిలీ అందరూ తినే టైమ్ కంటే ముందు మీరు తినేయండి.

4. ఏదో ఒక డైట్ ప్లాన్ లో ఉన్నప్పుడు కొన్ని ఫుడ్స్ మాత్రమే తీసుకుంటాం, కొన్ని పూర్తిగా ఎవాయిడ్ చేస్తాం. అందుకని, మీ తగ్గదల్చుకున వెయిట్ తగ్గిన తరువాత ఈ ప్లాన్స్ కి ఒక బ్రేక్ ఇవ్వండి.

5. పెద్ద ప్లేట్స్ లో తినడం వల్ల ఆటోమ్యాటిక్ గా ఎక్కువ ఫుడ్ ప్లేట్ లోకి వచ్చేస్తుంది. ఎక్కువ ఫుడ్ అంటే ఎక్కువ క్యాలరీలు. చిన్న ప్లేట్ లో వడ్డించుకోండి. అవసరమనుకుంటే మళ్ళీ వడ్డించుకోండి.

6. మంచం మీద పడుకుని నిద్ర కి ముందు సోషల్ మీడియాలో టైమ్ స్పెండ్ చేయడం వల్ల బ్రెయిన్ లో స్లీప్ హార్మోన్ ప్రొడ్యూస్ అవ్వదు. చాలినంత నిద్ర లేకపోతే కొవ్వు పెరుగుతుంది. మీ బెడ్రూమ్ ని నో టెక్నాలజీ జోన్ గా చేసుకోండి. కావాలంటే కాస్సేపు పుస్తకం చదువుకోండి.

7. హడావిడిగా తినేస్తున్నప్పుడు ఎంత తింటున్నామో, ఏం తింటున్నామో పట్టించుకోం. నెమ్మదిగా తినండి. రుచిని ఆస్వాదిస్తూ తినండి. ఒక సిప్ నీరు తాగండి. ఒక నిమిషం ఆగి అప్పుడు తినండి.

8. టీవీ చూస్తూ, మొబైల్ లో ఛాట్ చేస్తూ తినడం వల్ల మన పోర్షన్ సైజ్ మీద మనకి కంట్రోల్ ఉండదు. తింటున్న ఫుడ్ ని ఎంజాయ్ చేయలేరు. తీసుకుంటున్న ఆహారం మీదే ధ్యాస ఉంచి తినండి.

9. భోజనానికి ముందు ఒక గ్లాస్ మంచి నీరు తాగి అప్పుడు తినండి. ఇందువల్ల మెటబాలిక్ యాక్టివిటీ పెరుగుతుంది.

10. ఒత్తిడిగా ఉన్నప్పుడు తినకండి. మంచి నీరు తాగండి, వాకింగ్ కి వెళ్ళండి, ఫ్రెండ్స్ కి ఫోన్ చేయండి... ఫుడ్ మాత్రం తీసుకోండి.

11. లిఫ్ట్ వాడడం తగ్గించండి. మెట్లు ఎక్కి వెళ్ళండి. ఆఫీసుకి వెళ్ళాక కూడా ఒక ఫ్లోర్ కింద ఉన్న రెస్ట్రూమ్ యూజ్ చేయండి. రెండు ఫ్లోర్స్ పైన ఉన్న క్యాంటీన్ కి వెళ్ళండి. మెట్లు ఎక్కడాన్ని ఒక అలవాటుగా మార్చుకోండి.

12. మీ ఇంట్లో ఫుడ్ బయటకు కనపడేలా పెట్టకండి. ఫుడ్ అంటే ఇక్కడ తినడానికి రడీగా ఉండే, ఇన్స్టంట్ ఫుడ్. ఇన్స్టంట్ ఫుడ్ ఇంట్లో ఉంచుకోవడం అవసరమే, కానీ వాటిని షెల్ఫ్ లో వెనుక వరస లో పెట్టండి.

13. రాత్రి భోజనం లేట్ గా చేయడం, తిన్న వెంటనే నిద్రపోవడం బెల్లీ ఫ్యాట్ కి దారి తీస్తాయి. తొందరగా తినేయడం, తిన్నాక నిద్రకి కొంచెం టైమ్ ఇవ్వడం మంచిది. ఒకే టైమ్ కి డిన్నర్ తీసుకోవడం మంచిది. ఒక వేళ ఎప్పుడైనా లేట్ గా తినవలసి వస్తే కాసేపు వాకింగ్ చేయండి, మెటబాలిజం కొంచెం స్పీడ్గా జరుగుతుంది.

14. మనకి బోర్ గా ఉన్నప్పుడు కూడా ఆకలి వేస్తుంది. అందుకని ఈ సారి స్నాక్స్ అందుకునే ముందు ఆలోచించండి, నిజం గా ఆకలి వేస్తోందా, బోర్ గా ఉండి ఆకలిగా అనిపిస్తోందా అని.

15. మనకి ఒక అలవాటు ఉంది, అన్ని మంచి విషయాలని ఫుడ్ లేదా డ్రింక్స్ తో సెలిబ్రేట్ చేసుకుంటాం. సెలిబ్రేట్ చేసుకోవాలి తప్పనిసరిగా, కానీ ఫుడ్ ద్వారా కాదు. వెకేషన్ కి ప్లాన్ చేసుకోండి, లాంగ్ డ్రైవ్ కి వెళ్ళి రండి, ప్రేయర్ చేసుకోండి, బట్టలు కొనుక్కోండి.

16. కుకింగ్ షోస్ లో చెప్పిన ఇన్‌గ్రీడియెంట్స్ అన్ని వాడడం వల్ల కూడా ఫ్యాట్ పెరుగుతుందని ఒక స్టడీలో తెలిసింది. అవి చూడడం అవసరమే, కానీ ఆ ఇన్‌గ్రీడియెంట్స్ కి లో-ఫ్యాట్ వెర్షన్స్ అందుబాటులో ఉంటే అవే వాడండి.

17. ప్రోటీన్ ఎక్కువ, కార్బ్స్ తక్కువ ఉండే డైట్ వల్ల మొదట్లో బరువు తగ్గుతారు కానీ తరువాత వెయిట్ గెయిన్ కి అది కూడా ఒక కారణం అవుతుంది. అందు వల్ల బ్యాలెన్స్డ్ డైట్ కి ప్రిఫరెన్స్ ఇవ్వండి.

18. బరువు తగ్గే ఉద్దేశ్యం తో మీరు ఏదో ఒక మీల్ స్కిప్ చేస్తుంటే మాత్రం, వెంటనే ఆ అలవాటుని మార్చుకోవాలి. అలాగే, బ్రేక్ ఫాస్ట్, లంచ్, డిన్నర్ మాత్రమే తీసుకుంటే కూడా మనకి తెలియకుండానె ఎక్కువ క్యాలరీలు తీసుకుంటాం. ఈ మూడు మెయిన్ మీల్స్ తో పాటూ మధ్యలో స్నాక్స్ కూడా తీసుకోవాలి. అప్పుడు మెయిన్ మీల్స్ తక్కువ తీసుకుంటాం.

19. నట్స్ తీసుకోవడం వల్ల బరువు పెరుగుతామనే అపోహ చాలా మందిలో ఉంది. అది నిజం కాదు. ఆ మాటకొస్తే ఎక్కువగా ఏది తీసుకున్నా బరువు పెరుగుతాం. ఆల్మండ్స్, పిస్తా వంటి నట్స్ మనకి చేసే మేలే ఎక్కువ.

20. ఇరవై నాలుగు గంటల్లో ఏడెనిమిది గంటలు నిద్ర కి పక్కని పెడితే, మిగిలిన సమయం లో కూడా చాలా మంది వర్క్ దగ్గర కూర్చునే ఉంటారు. ఫోన్ లో రిమైండర్ పెట్టుకుని ప్రతి గంటకీ కొన్ని నిమిషాలు నడవండి. కాల్ ని బట్టి ఫోన్ లో మాట్లాడుతున్నప్పుడు కూడా నడుస్తూ మాట్లాడండి.

ఇవే కాక, రెగ్యులర్ గా వెయిట్ చెక్ చేసుకుంటూ ఉండడం, పార్టీకి వెళ్ళే ముందు ఇంట్లో ఏదైనా హెల్దీ స్నాక్ తిని వెళ్ళడం వంటి చిన్న చిన్న అలవాట్లు కూడా ఎంతో మేలు చేస్తాయి.

గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.

మరింత సమాచారం తెలుసుకోండి: