ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ న్యూస్ చదవండి... సాధారణంగా మనం చూస్తూ ఉంటాము. కొంతమంది అతిగా ఆకలితో అవస్థలు పడుతుంటారు. కొంతమందికి ఎంత తిన్నా... ఇంకా ఆకలి.. ఆకలి అంటూ కేకలు పెడతారు. అలాంటి వారు కొన్ని ఆరోగ్య సూత్రాలు పాటిస్తే చాలు.. ఆకలి నియంత్రణలో ఉండటమో, మాటిమాటికి ఆకలి వేయకుండా ఉండటమో జరుగుతుంది. అంతేకాదు.. శరీరం కూడా మరింత ఆరోగ్యవంతంగా తయారవుతుందని ఇటీవల నిర్వహించిన ఓ అధ్యయనంలో వెల్లడయ్యింది.

వాల్ నట్స్, సాల్మన్ ఫిష్ అంటే ఒకరకమైన చేప,  కనొలా విత్తుల నుంచి తీసిన నూనెలను ఆహారంలో వాడితే ఆకలి ఇట్టే అదుపులో ఉంటుందని తేలింది. వీటి వాడకం వల్ల శరీరంలోని తృప్తి హార్మోన్లు సంతృప్తి చెందిన మళ్లీ మళ్లీ తినాలనిపించే కోర్కెలను నశింపజేస్తాయని ఆ అధ్యయనంలో వెల్లడైంది.

వాల్ నట్స్, సాల్మన్ ఫిష్, కనొలా నూనెలను ఆహారంలో నిత్యం తీసుకుంటే ఆరోగ్యంతోపాటు చాలా సేపటి వరకు ఆకలిని గుర్తు చేయబోమని యూనివర్సిటీ ఆఫ్ జార్జియా నిర్వహించిన అధ్యయనంలో వెల్లడయ్యింది.
ఆకలిని జయించడం లేక ఆకలిని అదుపులో పెట్టుకునేందుకు వివిధ గ్రూపుల వయసుల గలవారిని పరిశోధించి వర్సిటీ అధ్యయనంలో ఈ విషయం పేర్కొంది.

ఇలాంటి మరిన్ని ఆరోగ్యానికి సంబంధించిన విషయాలు కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి...



మరింత సమాచారం తెలుసుకోండి: