ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి... డయేరియా లేదా లూజ్ మోషన్స్ చాలా అసౌకర్యంగా ఉంటాయి. కడుపులో నొప్పిగా ఉంటుంది, మాటిమాటికీ బాత్రూమ్ కి పరిగెత్తాల్సి ఉంటుంది, ఓపికంతా పోతుంది, నీరసం గా అనిపిస్తుంది. లూజ్ మోషన్స్ తో ఇంకొక సమస్య ఏమిటంటే శరీరం లో నుండి నీరు కూడా ఎక్కువ క్వాంటిటీస్ లో పోతుంది, ఫలితం గా డీహైడ్రేషన్ కి గురి అవ్వచ్చు. కాబట్టి ఈ సమస్య ఉన్నప్పుడు ఫ్లూయిడ్స్ ఎక్కువగా తీసుకోవాలని నిపుణులు చెబుతూ ఉంటారు. అంతే కాక కొన్ని ఫుడ్స్ కూడా ఈ టైమ్ లో ఉపయోగకరంగా ఉంటాయి. అవేమిటో తెలుసుకుందాం.

బనానా... డయేరియా తో సఫర్ అవుతున్నప్పుడు తీసుకోవాల్సిన బెస్ట్ ఫుడ్స్ లో బనానా కూడా ఒకటి. అరటి పండులో ఉండే పొటాషియం అరుగుదలకి సహకరిస్తుంది. ఇందులో ఉండే రెసిస్టెంట్ స్టార్చ్ కోలొన్ లో నుండి నీరు, ఉప్పు ని గ్రహిస్తుంది. ఫలితంగా మోషన్ ఫర్మ్ గా అవుతుంది. ఈ పండులో ఉండే ఫైబర్ వల్ల నార్మల్ బవెల్ యాక్టివిటీ రిస్టోర్ అవుతుంది.

పెరుగు...పెరుగు తేలికగా ఉంటుంది. ఈజీగా అరుగుతుంది. ఇందులో ఉండే ప్రోబయాటిక్ మంచి బ్యాక్టీరియాని ప్రమోట్ చేస్తుంది. ఫలితం గా డైజెషన్ బాగా జరిగి బవెల్ మూమెంట్స్ హెల్దీ గా మారతాయి.

యాపిల్స్....చెక్కు తీసిన యాపిల్స్ కూడా ఈ సమస్య కి బాగా హెల్ప్ చేస్తాయి. యాపిల్స్ ని స్ట్యూ చేసి కూడా తీసుకోవచ్చు.

ఓట్మీల్...ఓట్స్ లో ఉండే సాల్యుబుల్ ఫైబర్ గాస్ట్రో ఇంటెస్టైనల్ ట్రాక్ట్ లో నుండి నీటిని గ్రహించి మోషన్ ఫర్మ్ గా అయ్యేలా చేస్తుంది. అయితే, ఓట్స్ ని పాల లో కలిపి ఈ సమయం లో తీసుకోకూడదు. బీన్స్, కీరా, క్యారెట్ వంటి వాటితో కలిపి తీసుకోవచ్చు.

 కొబ్బరి నీరు....కొబ్బరి నీటిలో ఉండే పొటాషియం, సోడియం వంటి ఎలెక్ట్రొలైట్స్ బాడీలో ఎలెక్ట్రొలైట్ బ్యాలెన్స్ ని సరి చేస్తాయి. లూజ్ మోషన్స్ వల్ల నష్టపోయిన నీటి శాతాన్ని కొబ్బరి నీరు పూరిస్తాయి.

జీలకర్ర నీరు...ఒక గిన్నెలో ఒక కప్పు నీరు పోసి ఒక టీ స్పూన్ జీల కర్ర  వేసి మరిగించండి. తరువాత కొద్ది నిమిషాలు సిమ్ లో ఉంచండి. చల్లారిన తరువాత వడకట్టి తాగేయండి. ఇది ఇరిటేట్ అయి ఉన్న బవెల్స్ ని చల్లబరుస్తుంది. బాడీని రీ హైడ్రేట్ చేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: