ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి.. చాలా మంది కిడ్నీల సమస్యతో బాధ పడుతుంటారు. ఈ పద్ధతులు పాటిస్తే కిడ్నీ సమస్యల నుంచి బయటపడొచ్చు.

నీరు ఎక్కువ తాగడం. రోజుకి కనీసం ఆరు నుండి ఎనిమిది గ్లాసుల నీరు తాగాలి.కాల్షియం ఉన్న ఫుడ్స్ తీసుకోవడం. పాలు, పాల పదార్ధాలు వంటి డైటరీ కాల్షియం ఆక్సలేట్ లెవెల్స్ ని తగ్గిస్తాయి.పాల కూర వంటి ఆక్సలేట్స్ ఎక్కువగా ఉండే ఫుడ్స్ ని లిమిటెడ్ గా తీసుకోవడం.రెగ్యులర్ గా పుచ్చకాయ తీసుకోవడం కిడ్నీ స్టోన్స్ ట్రీట్మెంట్ లోనే కాదు, అసలు స్టోన్స్ ఫార్మ్ అవ్వకుండా ఉండడానికి కూడా హెల్ప్ చేస్తుంది. రాజ్మా కూడా ఈ సమస్యకి మంచి పరిష్కారమే. రాజ్మా సూప్, సలాడ్ వంటివి తీసుకోవచ్చు. సెలరీ జ్యూస్ టాక్సిన్స్ ని బయటకి పంపడం లో హెల్ప్ చేస్తుంది. రోజు ఒక గ్లాసు సెలరీ జ్యూస్ తాగితే ఇంకా స్టోన్స్ ఫార్మ్ అవ్వకుండా ఉంటాయి.

ఉప్పు తక్కువగా తీసుకోవడం. రోజుకి ఐదు గ్రాముల కంటే ఎక్కువ ఉప్పు తీసుకోకుండా ఉండడం.షుగర్, ఆర్టిఫీషియల్ స్వీటెనర్స్ ఉన్న ఫుడ్స్ తీసుకోకుండా ఉండడం.దానిమ్మ గింజలు, రసం రెండూ మంచివే. రోజుకి ఒక దానిమ్మ పండు తినవచ్చు, లేదా అప్పుడే తీసిన దానిమ్మ రసం ఒక గ్లాసు తాగవచ్చు.

ఫ్రూట్ సలాడ్ లో దానిమ్మ గింజలు కూడా కలపవచ్చు. ముఖ్యంగా రెడ్ మీట్ తగ్గించండి.వీలైతే మానేయండి.  
రెగ్యులర్ గా ఎక్సర్సైజ్ చేయడం అలవాటు చేసుకోండి.
బరువు ని అదుపులో ఉంచుకోవడం చాలా ముఖ్యం.
సీజన్లో దొరికే అన్ని పండ్లూ కూరగాయలు ఆహారంగా తీసుకోండి.

ఇలాంటి మరిన్ని ఆరోగ్యానికి సంబంధించిన ఆర్టికల్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి..

మరింత సమాచారం తెలుసుకోండి: