శరీరంపై వున్న అవాంఛిత రోమాలు తొలగించుకుంటప్పుడు కచ్చితంగా ఈ జాగ్రత్తలు పాటించాలి. ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఆ జాగ్రత్తలు ఏంటో తెలుసుకోండి...


మీ శరీరంపై వున్న అవాంఛిత రోమాలు తొలగించేటప్పుడు బ్లెడ్స్ ని  తుప్పు పట్టకుండా చూసుకోండి. బ్లేడ్స్ ను రీప్లేస్ చేసే రేజర్స్ ని ఎంచుకోండి. షేవింగ్ తరువాత రేజర్స్ లో మాయిశ్చర్ లేకుండా చూసుకోండి.ఇరిటేటెడ్ స్కిన్ ను షేవ్ చేయకండి. అలర్జీస్, ర్యాషెస్ లేదా గాయాలు ఉన్నట్టయితే షేవింగ్ ను అవాయిడ్ చేయడం మంచిది. తేనెలో యాంటీ ఇన్ఫ్లమేటరీతో పాటు యాంటీ మైక్రోబయాల్ ప్రాపర్టీస్ ఉన్నాయి. ఇవి ఇరిటేటెడ్ స్కిన్ పై మ్యాజిక్ చేస్తాయి. స్కిన్ ను హీల్ చేస్తాయి. కాస్తంత తేనెని స్కిన్ పై అప్లై చేసి పది నుంచి పదిహేను నిమిషాల వరకు అలాగే ఉంచండి. ఆ తరువాత వెచ్చటి నీటితో కడిగేయండి.

నిద్రపోయే ముందు బాడీ హెయిర్ ను షేవ్ చేసుకుంటే మంచిదన్న విషయం మీకు తెలుసా? ఇలా చేస్తే స్కిన్ కి తగినంత రెస్ట్ లభిస్తుంది. త్వరగా హీల్ అవుతుంది. షేవింగ్ వల్ల స్కిన్ కొంచెం స్ట్రెయిన్ అవుతుంది. బాహ్య వాతావరణ ప్రభావం స్కిన్ పై పడే అవకాశం ఉంది. కాబట్టి, నిద్రపోయే ముందు షేవింగ్ చేయడం వల్ల స్కిన్ త్వరగా రికవర్ అయ్యే అవకాశం ఉంది.షేవింగ్ జెల్ లేకపోతే హెయిర్ కండిషనర్ ను వాడండి. సోప్ ను మాత్రం వాడకూడదు. స్కిన్ కి కావలసినంత మాయిశ్చర్ ను సోప్ అందించలేదు.

షేవింగ్ తరువాత స్కిన్ ని మాయిశ్చర్ చేసుకోవడం మంచిది. కాసేపాగి ఆల్కహాల్ ఫ్రీ మాయిశ్చరైజర్ ను అప్లై చేయండి. అలాగే, కొబ్బరి నూనె లేదా షీ బటర్ కూడా ఆఫ్టర్ షేవ్ మాయిశ్చరైజర్స్ గా హెల్ప్ చేస్తాయి. షేవింగ్ చేయడం వల్ల స్కిన్ అనేది డ్రైగా అలాగే ఇచీగా మారుతుంది. కాబట్టి, స్కిన్ లోని మాయిశ్చర్ కంటెంట్ ను నేచురల్ గా బాలన్స్ చేయడం మంచిది. కాబట్టి, స్కిన్ పై పెట్రోలియం వంటి మాయిశ్చరైజర్ ను అప్లై చేయడం మంచిది.

మరింత సమాచారం తెలుసుకోండి: