ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి...
పీడ కలల వల్ల ఏర్పడే ఈ నిద్రలేమి పరిస్థితిని ‘ఆర్‌ఈఎం స్లీప్ బిహేవియర్ డిజార్డర్’ అంటారని పరిశోధకులు తెలిపారు. ఈ సమస్యతో బాధపడేవారికి పీడ కలలు తరచూ వస్తూనే ఉంటాయి. తమ చుట్టూ ఏవో తిరుగుతున్నట్లు, భయపెడుతున్నట్లుగా భావిస్తారని, కొందరు మంచంపై నుంచి ఎగిరి దూకుతారని పరిశోధనలో వెల్లడైందట.


 పీడకలలు.. ఒక్కోసారి మెళకువ వచ్చిన తర్వాత కూడా వెంటాడతాయి. కొన్ని పీడ కలలు వాస్తవానికి దగ్గరగా ఉంటాయి. వాటిని మరిచిపోలేక కొంత మంది భయంతో గడుపుతుంటారు. వారికి సరిగా నిద్రకూడా పట్టదు. ఫలితంగా భవిష్యత్తులో అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా.. పీడ కలలతో బాధపడే వ్యక్తులు తీవ్రమైన ఒత్తిడితోపాటు కుంగుబాటు, ఆందోళనకు గురవ్వుతారని పేర్కొన్నారు.

ఇక ఈ పీడ కలలు రాకుండా ఉండాలంటే రోజు పడుకునే ముందు ఎలాంటి ఆలోచనలు చెయ్యకూడదు. మంచి పుస్తకాలు చదువుకోవాలి. లేదంటే పవిత్ర గ్రంధాలు చదవాలి. పవిత్ర గ్రంధాలు చదివితే మనసు ప్రశాంతంగా ఉంటుంది. అందువల్ల ఎలాంటి ఎలాంటి పీడకలలు రావు. అలాగే పడుకునేముందు ఇష్ట దైవానికి ప్రార్ధన చేస్తే చాలా మంచిది. అలా చేస్తే ఒత్తిడి దూరమై మానసికంగా దృఢంగా వుంటారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: