ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి...చేపల కూర గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. చేప కూర వాసన కె నోట్లో నీళ్లూరుతాయి. అంతలా గుమ గుమ లాడిపోతుంది చేప కూర.చేపలు కూర అంటే చాలు.. మాంసాహారులు లొట్టలేసుకుని మరి ఫుల్ గా లాగించేస్తారు. చాలామంది మాంసం తినడం  కంటే చేపలను తినడానికే ఎక్కువ ఇష్టపడతారు. మరి, చేపలు తినడం ఆరోగ్యానికి మంచిదేనా? దీనిపై తాజా పరిశోధనలో తేలిన ఈ ఆసక్తికర విషయాలు గురించి తెలిస్తే.. మీరు తప్పకుండా ఆశ్చర్యపోతారు. మరి ఆ ఆసక్తికరమైన విషయాలు ఏంటో ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ లో చదవండి...

చేపలు గుండె జబ్బు వున్న వాళ్ళు తింటే వాళ్ళ ఆరోగ్యానికి చాలా మంచిదని పరిశోధనలో వెళ్లడయింది. చేపలు  తినడం వల్ల గుండె సంబంధిత వ్యాధులకు దూరంగా ఉండవచ్చని అమెరికన్ హార్ట్ అసోసియేషన్ నిర్వహించిన ఓ అధ్యయంలో తేలింది. మాలిక్యులార్ న్యూట్రిషన్ అండ్ ఫుడ్ రిసెర్చ్, న్యూట్రిషనల్ బయోకెమిస్ట్రీ జర్నల్స్‌లోనూ ఈ విషయాన్ని ప్రధానంగా ప్రస్తావించడం జరిగింది. చేపలను తినడం వల్ల గుండె జబ్బులు దూరమవుతాయని ఆయా కథనాల్లో స్పష్టంగా పేర్కొనటం జరిగింది...


చేపల్లో చాలా రకాలు ఉంటాయి. అయితే, మీరు ఒమెగా 3 ఫ్యాటీ ఆమ్లాలు అధికంగా ఉండే మాకరెల్, సాల్మన్, హెర్రింగ్, లేక్ ట్రౌట్, సార్డిన్స్, అల్బాకోర్ ట్యూనా రకానికి చెందిన చేపలను తీసుకుంటే మంచిదని నిపుణులు తెలుపుతున్నారు. అలాగే.. వారంలో కనీసం రెండుసార్లు చేపలను తీసుకుంటే మంచి ఫలితం ఉంటుందట. లేదా వారానికి కనీసం 100 గ్రాముల వరకు ఉడకబెట్టిన, లేదా వేయించిన  చేపలను తినడం ఉత్తమం.శరీరంలోని చెడు కొవ్వులను బయటకు పంపేసే ఒమెగా 3 ఫ్యాటీ ఆమ్లాలు చేపల్లో సమృద్ధిగా ఉంటాయట.


దీని వల్ల శరీరంలో కొవ్వు అతిగా పేరుకుపోదు. దీంతో రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోయే పరిస్థితులు తగ్గుముఖం పడతాయి. ఫలితంగా గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉండదు...ఇలాంటి మరెన్నో ఆరోగ్యానికి సంబంధించిన విషయాలు కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో ఆరోగ్యకరమైన విషయాలు గురించి తెలుసుకోండి...

మరింత సమాచారం తెలుసుకోండి: