ప్రపంచవ్యాప్తంగా డయాబెటిస్ చాలా మందిని పట్టి పీడిస్తుంది. షుగర్ సమస్య చాలా మంది జనాలు  ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య. డయాబెటిస్ రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతుంది. ఇది నయంకాని వ్యాధి, ఈ వ్యాధి ఉన్న ప్రతిఒక్కరు రక్తంలోని చక్కెర స్థాయిలను బాలన్స్ చేయడం ఒక్కటే దీనికి మార్గం. అలా బాలన్స్ చేయడంలో వారు తీసుకునే ఆహారం ప్రధాన పాత్ర పోషిస్తుంది.ఇలా షుగర్ వ్యాధిని తగ్గించుకోవడానికి లేదా అదుపులో  పెట్టుకోవడానికి స్టఫ్డ్ రోటీని తినండి. కచ్చితంగా షుగర్ వ్యాధి తగ్గిపోతుంది..

ఆరోగ్యవంతమైన స్టఫ్డ్ రోటీ తయారు చేసే విధానం తెలుసుకోండి....

కావాలసిన పదార్ధాలు...రాగి పిండి- 1/2 కప్పు, గోధుమ పిండి- 1/2 కప్పునీరు తగినంత, ఉప్పు రుచికి సరిపడేంత తీసుకోవాలి...

స్టఫింగ్ కోసం...కాకరకాయ (తరిగిన) - 1 టేబుల్ స్పూన్, మెంతి ఆకులు (తరిగిన) - 2 టేబుల్ స్పూన్లు, బచ్చలికూర (తరిగిన) - 2 టేబుల్ స్పూన్లు,కాలీఫ్లవర్ (తురిమిన) - 2 టేబుల్ స్పూన్లు,పచ్చిమిర్చి (చిన్నగా తరిగినది) - 1 స్పూన్, అల్లం (తరిగిన) - 1/2 స్పూన్,ఉప్పు- రుచికి సరిపడినంత, నూనె - 1 స్పూన్

తయారు చేయు విధానం...రాగిపిండి అర కప్పు , గోధుమ పిండి అరకప్పు తీసుకోని తగినంత నీళ్లు, ఉప్పు వేసి బాగా మెత్తగా అయ్యేవరకు కలపండి.మీకు కావాలనుకున్న సైజులో పిండిని గుండ్రంగా చేసి పక్కన పెట్టుకోండి.ఇక స్టఫింగ్ కోసం తీసుకున్న కూరగాయలు  అన్నింటిని, అల్లం, పచ్చిమిర్చి మరియు ఉప్పు లను వేసి మెత్తగా కలపండి.ఇప్పుడు విభజించిన పిండిలో ఒక భాగాన్ని బాల్ లాగా చుట్టండి.ఈ బాల్ మధ్యలో కొంత స్టఫ్ ను పెట్టండి. పిండిని అన్ని వైపుల నుండి మడిచి మూసివేయండి. చిటికెడు నూనెను ఉపయోగించి స్టఫ్ మొత్తం రోటీ లోపల కవర్ అయ్యేలా గుండ్రంగా చెయ్యండి.కొంచెం పిండి ఉపయోగించి రోటీ చెయ్యండి. ఒక నాన్ స్టిక్ పాన్ మీద నెయ్యి లేదా నూనెతో కాల్చండి.విభజించిన పిండితో మిగిలిన రోటీలు చెయ్యండి. ఇక రోటీలను తినండి ఖచ్చితంగా షుగర్ వ్యాధి తగ్గిపోతుంది.డయాబెటిస్ కి ఉపయోగపడే, పౌష్టికమైన స్టఫ్డ్ రోటీలను మీరు కూడా ప్రయత్నించండి.ఇక ఇలాంటి మరెన్నో ఆరోగ్యకరమైన విషయాలు  కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి...

మరింత సమాచారం తెలుసుకోండి: