ప్రతి రోజు రన్నింగ్ చేయడం వల్ల మన ఆరోగ్యానికి మంచిదని అందరికీ తెలుసు .రన్నింగ్ వ్యాయామంలో ఒక భాగమే. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం రన్నింగ్ చేయడం వల్ల మన శరీరంలోని కొలెస్ట్రాల్ కలిగి రక్త ప్రసరణ వ్యవస్థ సక్రమంగా జరిగి గుండె పనితీరు మెరుగుపడుతుంది. కొంత శారీరక శ్రమ కలిగిన రన్నింగ్ చేసేవారిలో  వ్యాధినిరోధకశక్తి ఎక్కువగా ఉంటుందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. అయితే రన్నింగ్ చేసేటప్పుడు కొన్ని నియమాలు, జాగ్రత్తలు  తప్పనిసరిగా పాటించాలి అవేంటో ఇప్పుడు చూద్దాం..


రన్నింగ్ ప్రారంభించే ముందు మన శరీరాన్ని ఒక క్రమపద్ధతిలో చిన్న చిన్న వ్యాయామాలు చేయడం తప్పనిసరి . ఇలా చేయడం వల్ల మన శరీరం తొందరగా అలసి పోదు.
మన పాదాలకు అనుగుణంగానే రన్నింగ్ షూస్ వాడాలి లేదంటే పాదాలకు గాయం అవడమే కాకుండా భవిష్యత్తులో కీళ్ళ నొప్పులు వంటి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది.

మీరు కొంత దూరం రన్నింగ్ చేసిన తర్వాత సాధారణంగా శ్వాసక్రియ రేటు కూడా పెరుగుతుంది. మీ శ్వాస కి తగినట్లుగా మీరు రన్నింగ్  స్పీడ్ ని అడ్జెస్ట్ చేసుకోండి. అంటే  ఒకటి రెండు నిమిషాలు రన్నింగ్ స్పీడ్ తగ్గించండి. తద్వారా మీ శ్వాసక్రియ రేటు తగ్గి మళ్లీ రన్నింగ్ వేగం పెంచడానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా ప్రాక్టీస్ చేస్తే తక్కువ సమయంలో ఎక్కువ దూరం రన్నింగ్ చేయడానికి అవకాశం ఉంటుంది.  

మీరు కొన్ని బ్రీతింగ్ టెక్నిక్స్( శ్వాస పద్ధతులు) ప్రాక్టీస్ చేయడం వలన ఊపిరితిత్తులలో ఆక్సిజన్ నిల్వ సామర్థ్యం పెరుగుతుంది.  మీ శ్వాస  మీ శరీర కదలికలకు అనుగుణంగా  ఉండాలి. అప్పుడే మన శరీరం ఎక్కువ ఆక్సిజన్ను తీసుకోగలుగుతుంది అవసరమైతే ముక్కు తోనే కాకుండా నోటి ద్వారా కూడా గాలి పీల్చుకోవచ్చు తద్వారా మన శరీరానికి కావలసిన ఆక్సిజన్ అందుతుంది .

 మీరు వంగిపోయి పరిగెడుతుంటే ఆ  ప్రభావం ఊపిరితిత్తుల  మీద పడుతుంది.మీరు సరిగ్గా శ్వాస తీసుకోలేరు. మీ భుజాలు వెనక్కి ఉండాలి, మీ తల పైకి ఉండాలని నియమాలను ఖచ్చితంగా పాటించాలి. అప్పుడే మీరు చేస్తున్న రన్నింగ్ కు ఖచ్చితమైన ఫలితం దక్కుతుంది.

మీరు  వ్యాయామం చేస్తున్నప్పుడు ఏ విధమైన అనారోగ్య సమస్యలు తలెత్తిన కచ్చితంగా వైద్యున్ని సంప్రదించి తగిన సలహాలు పొంది వ్యాయామం చేయడం తప్పనిసరి.

మరింత సమాచారం తెలుసుకోండి: