ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి..ఈ రోజుల్లో చాలా మంది ఎక్కువగా కిడ్నీ సమస్యతో బాధపడుతూ వుంటారు. అలాంటి వారు ఈ పద్ధతులు పాటించండి. ఖచ్చితంగా కిడ్నీ సమస్య నుంచి విముక్తి పొందితారు..కిడ్నీ వ్యాధులకి ప్రధాన కారణాలు డయాబెటీస్, హైబీపీ. అందుకనే, సోడియం, కొలెస్ట్రాల్ తక్కువగా ఉన్న ఫుడ్స్ తీసుకోండి. హెల్దీ ఫుడ్ ఛాయిసెస్ చేసుకోండి. ఇందు వల్ల ఈ కండిషన్స్ కంట్రోల్ లో ఉంటాయి, కిడ్నీస్ కూడా ఆరోగ్యంగా ఉంటాయి.స్మోకింగ్, ఆల్కహాల్ తో సహా బ్లడ్ లో ఉన్న హానికారకాలను బయటకి పంపించే పని కిడ్నీ చేస్తుంది. కాబట్టి కిడ్నీ మీద ఒత్తిడి పెరగకూడదనుకుంటే అనవసరమైన వాటికి దూరంగా ఉండాలి. మెడిసిన్స్ ని కూడా కిడ్నీస్ ఫిల్టర్ చేస్తాయి, కాబట్టి ప్రిస్క్రైబ్ చేసిన డోస్ కంటే ఎక్కువ డోస్ లో ఎప్పుడూ మెడిసిన్స్ తీసుకోకూడదు.

మీకు అవసరం లేని మెడిసిన్స్ అసలు తీసుకోకూడదు.కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉంటే ఎక్కువ నీరు తాగినా ప్రమాదమే. అందుకే, నీరు తాగడం ఆరోగ్యానికి ఎంత అవసరమైనా అతిగా మాత్రం తాగకూడదు. ఇక్కడే ఒక చిన్న పాయింట్ ఫాలో అయితే సరిపోతుంది. రోజుకి ఎనిమిది గ్లాసుల నీరు లాంటి లెక్కలన్నీ పక్కన పెట్టేసి యూరిన్ ఎలాంటి కలర్ లేకుండా లేదా లైట్ యెల్లో కలర్‌లో ఉండేట్లు చూసుకుంటే సరిపోతుంది. డార్క్ యెల్లో కలర్‌లో యూరిన్ ఉంటే నీరు ఇంకా తాగాలని అర్ధం. కలర్ లేకుండా, లేదా లైట్ యెల్లో కలర్‌లో ఉంటే మీరు తాగుతున్న నీరు సరిపోతోందని అర్ధం. రెగ్యులర్ గా ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటే హెల్దీ వెయిట్ మెయింటెయిన్ చేయడానికి వీలుగా ఉంటుంది. హార్ట్ డిసీజ్, డయాబెటీస్ ని ప్రివెంట్ చేయవచ్చు, బ్లడ్ ప్రెషర్, కొలెస్ట్రాల్ ని కంట్రోల్ చేయవచ్చు..

కొంత మందికి కిడ్నీ డిసీజెస్ త్వరగా వస్తాయి. దానికి కారణం మీరు, లేదా మీ లైఫ్ స్టైల్ కారణం కాకపోవచ్చు. డయాబెటీస్, హైబీపీ వంటివి ప్రధాన కారణాలని మనకి తెలుసు కానీ, హార్ట్ డిసీజ్, ఒబెసిటీ, స్మోకింగ్, వయసు, ఫ్యామిలీ హిస్టరీ వంటివి కూడా కిడ్నీ వ్యాధులకి కారణాలే. గోల్డెన్ రూల్ ఆఫ్ హైడ్రేషన్ మరిచిపోకండి.7కిడ్నీ డిసీజ్ ని సైలెంట్ కిల్లర్ అని అంటారు. ఎందుకంటే లక్షణాలు బయట పడేప్పటికే 90% కిడ్నీ ఫంక్షన్ పోతుంది.ఇక ఇలాంటి మరెన్నో ఆరోగ్యకరమైన విషయాలు కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో విషయాలు తెలుసుకోండి...

మరింత సమాచారం తెలుసుకోండి: