మనలో చాలామందికి ఉన్నట్లుండి అడుగులు బరువుగా పడుతున్నట్టుగా అనిపిస్తున్నాయి. మరికొంతమందికి ఎక్కువ సేపు కూర్చుంటే పాదాలు వాపు కి గురవుతుంటాయి. మరికొంతమందిలో ఎక్కువ సేపు నిలబడ్డా కూడా పాదాలు వాపు వస్తుంటాయి.  మామూలుగా అయితే గర్భిణీ స్త్రీలలో పాదాల్లో వాపు కనిపిస్తుంది. కొంత మంది గర్భిణీ స్త్రీలు ఎక్కువ సేపు కూర్చొని పనిచేయడం వల్ల పాదాల్లో వాపు వస్తే, మరికొంతమందిలో ఏమి చేయకపోయినా కూడా పాదాలు వాపు గురవుతుంటాయి. మరి ఎందుకు పాదాలు వాపు వస్తుంటాయి? దీని వల్ల కలిగే ప్రమాదమెంతో? అనే విషయాలు ఇప్పుడు చూద్దాం.

పాదాల వాపుకు అనేక కారణాలు ఉంటాయి. మరికొంత మందిలో ఎక్కువ సేపు కూర్చోవడం వల్ల, మరి కొంతమంది ఎక్కువ సేపు నిలబడటం వల్ల పాదాల్లో వాపు వస్తుంటుంది. ఎక్కువ గంటలు కూర్చుని పనిచేసే వారిలో,వెరికోసీల్  వెయిన్స్ సమస్య ఉన్నవారికి ఇలా జరుగుతుంది.  ఈ వాపు ఒక దశలో తీవ్రమైన నొప్పికి దారితీయడంతో పాటు చర్మం రంగు కూడా మారుతుంది. సాధారణంగా కనిపించే వాపులో  చేతితో ఆ భాగాన్ని  నొక్కినప్పుడు వాపు ఉన్న భాగంలో నొక్కిన  వెంటనే  ఆ భాగం తిరిగి యధాస్థితికి వచ్చేస్తుంది.

కానీ వేలితో నొక్కిన ప్రాంతంలో గుంటలాగా పడిపోయి, కొద్ది క్షణాల వరకు ఆ భాగం లోపలికి అలాగే ఉంటే అది తీవ్రమైన సమస్యగా భావించాలి. కిడ్నీ,గుండె, కాలేయం భాగాలలో ఏదైనా సమస్య ఉన్నట్టు. లేదా హైపోథైరాయిడిజం ఉన్నట్టు కూడా అనుకోవచ్చు.పాదాల్లో వాపు ఎక్కువ అయి  ఈ బాధ తీవ్రమైనప్పుడు ఆకలి తగ్గడం,బరువు పెరగడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలగడం,చర్మం రంగు మారడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. అప్పుడు వెంటనే డాక్టర్ను సంప్రదించాల్సి ఉంటుంది.

సాధారణ వాపు ప్రక్రియ అయితే మాత్రం పాదాలను కొంచెం ఎత్తులో ఉంచి కూర్చోవడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుతుంది. అంతేకాకుండా కాలి కింది భాగంలో తల దిండు పెట్టుకోవడం లాంటివి చేయాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: