శనగలు మన భారతీయ వంటకాల్లో చాలా ప్రాముఖ్యత ఉంది. శనగలను కొన్ని వందల సంవత్సరాలుగా మనం ఆహారంగా  వినియోగిస్తున్నాం. అత్యధిక పోషక విలువలు ఉన్న పప్పు ధాన్యాల్లో శనగలు కూడా ఒకటి. శనగలను ఆహారంగా నిత్యం వివిధ రూపాల్లో  తీసుకుంటాం.

అయితే పొట్టు తీసిన శనగల కంటే పొట్టుతీయని శెనగల ఆరోగ్యానికి మంచిది. శెనగల ని ఇష్టపడని వారంటూ ఎవరూ ఉండరు . శనగలను ఉడికించుకుని తిన్న,  ఫ్రై చేసుకుని తిన్న,  సలాడ్ రూపంలో లాగించినా. మొలక చేసుకొని తిన్న ఇందులో ఉండే పోషక విలువలు మన శరీరానికి అవసరమైన  యాంటీఆక్సిడెంట్లు, నిరోధక శక్తిని పెంపొందిస్తాయి.

పిల్లలకు ప్రతిరోజు కొన్ని ఉడకబెట్టిన శనగలు స్నాక్స్ రూపంలో ఇవ్వడం చాలా మంచిది.ఇందులో ఉండే మాంగనీస్, మెగ్నీషియం శరీరానికి కావాల్సిన తక్షణ శక్తిని, రోగనిరోధక శక్తిని పెంపొందించడానికి  సహాయపడతాయి.

శనగలు మొలక కట్టి ఆహారంగా తీసుకుంటే ఇందులో ఉండే పీచు పదార్థం జీర్ణ వ్యవస్థ సక్రమంగా జరిగేటట్లు చేస్తుంది తద్వారా మలబద్ధకం, పేగు సంబంధిత క్యాన్సర్ల నుండి  రక్షణ పొందవచ్చు.

ప్రతిరోజూ గుప్పెడు శనగలను ఆహారంగా తీసుకోవడం వల్ల మన శరీరానికి అవసరమైన ఐరన్ సక్రమంగా లభిస్తుంది. మన శరీరంలో  ఐరన్ సమృద్ధిగా ఉంటే ఆస్టియో ఫ్లోరోసిస్ , కీళ్ల నొప్పులు వంటి భయంకర వ్యాధుల నుంచి మనల్ని మనం కాపాడుకోవచ్చు.

శ‌న‌గ‌ల్లో  ట్రిప్టోఫాన్‌, సెరొటోనిన్ వంటి ఉప‌యోగ‌క‌ర‌మైన పోష‌కాలు స‌మృద్ధిగా ఉంటాయి. ఇవి చ‌క్క‌గా నిద్ర ప‌ట్టేలా చేస్తాయి. దీంతో నిద్ర‌లేమి దూర‌మ‌వుతుంది.

శ‌న‌గ‌ల్లో అమైనో యాసిడ్లు అనేక రకాల  క్యాన్సర్ కారకాలను నాశనం చేస్తాయి.  

శనగల్లో ఫ్యాట్ కరిగించే గుణం ఉంది. వీటిల్లో ఉండే ఫోలేట్ శరీరంలో చెడు కొలెస్ర్టాల్ ను తగ్గించి, శరీర బరువు పెరగకుండా చేయడంలో కీలకపాత్ర పోషిస్తుంది.

శనగల్లోని ఎమినో యాసిడ్స్ రక్తకణాల ఎదుగుదలకు దోహదపడతాయి కావున భయంకరమైన రక్తహీనత వంటి సమస్యలకు దూరంగా ఉండవచ్చు.

కావున శనగలు ప్రతిరోజు మన ఆహారం లో ఏదో ఒక రూపంలో తీసుకోవడం చాలా మంచిది.

మరింత సమాచారం తెలుసుకోండి: