అనారోగ్య సమస్యల కన్నా ఊబకాయం ఈ సమస్య ఎక్కువగా ఉంది.  ఊబకాయం తగ్గించడానికిమనం చేసే ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కావు,ఊబకాయం అనేది అనేక కారణాల వల్ల, అలవాట్ల వల్ల ఎక్కువగా వస్తుంది.ఊబకాయం వల్ల కీళ్ల నొప్పులు షుగరు, బీపీ వంటి సమస్యలు వస్తున్నాయి. వీటన్నింటికీ చెక్ పెట్టాలంటే వ్యాయామం,  వాకింగ్, ఇలాంటివి చేయడమే కాకుండా ఇంట్లో దొరికే వాటితో డ్రింక్ తయారుచేసుకుని వాడటం వల్ల సులువుగా బరువు తగ్గొచ్చు. ఆ డ్రింక్స్ వివరాల గురించి తెలుసుకుందాం..

 రోజు పరగడుపున పాలలో పసుపు వేసుకొని తాగడం వల్ల బరువు తగ్గవచ్చు, పసుపులో ఆంటీ యాక్సిడెంట్లు,
యాంటీ మైక్రోబియల్ లక్షణాలు ఉంటాయి.  ఇవన్నీ బరువు తగ్గడానికి సహాయపడుతాయి.

 పసుపు పొడి, మిరియాల పొడి తేనెతో కలిపి గోరువెచ్చని నీటిలో వేసి రోజూ ఒక గ్లాసు ఉదయం పరగడుపున తాగాలి. ఇలా తాగడం వల్ల బరువు తగ్గుతారు.

 ఒక గ్లాసు నీళ్ళు తీసుకొని అందులోకి అల్లము,  పసుపు వేసి ఐదు నిమిషాలు బాగా ఉడకబెట్టాలి.వడగట్టి వీటిలో తేనె కలుపుకొని ఉదయాన్నే టీ,కాఫీఈ డ్రింక్ తీసుకోవడం వల్ల బరువు తగ్గుతారు.

పావు కప్పు పసుపు,ఒక స్పూన్ కొబ్బరి నూనె,  ఒక స్పూన్ మిరియాలపొడికలిపి ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకోవాలి. ఈ పొడిని రోజు ఒక టీస్పూను అల్పాహారానికి ముందు తీసుకోవడం వల్ల బరువు తగ్గుతారు.

 ఒక గిన్నె తీసుకొని కొన్ని నీళ్లు పోసి అందులోకి,అల్లము పసుపు వేసి బాగా మరగనివ్వాలి.తర్వాత ఈ బాక్స్ తీసుకొని ఇందులో వేయాలి. దాల్చిన చెక్క ముక్కలు కూడా వేయాలి. పది నిమిషాల తర్వాత వడగట్టి తేనె కలుపుకొని తాగాలి. ఇలా చేయడం వల్ల బరువు వేగంగా తగ్గుతుంది.

 పావు టీ స్పూన్ పసుపు,  3 టేబుల్ స్పూన్లు జీలకర్ర, తీసుకొనిముందు రోజు జీలకర్ర ని నానబెట్టి ఉదయాన్నే రెండు నిమిషాలు ఉడకబెట్టి వడకట్టుకోవాలి. ఇందులోకి పసుపు, తేనె కలుపుకొని ఉదయాన్నే తీసుకోవడం వల్ల బరువు తగ్గుతారు.

 ఒక కప్పు నీళ్ళు తీసుకొని బాగా వేడి చేసిన తర్వాత ఒక టీస్పూన్ పసుపు పొడి,అర టీ స్పూన్ నిమ్మరసం అర టీ స్పూను తేనె కలుపుకొని ఉదయాన్నే తాగాలి.

 కప్పు నీరు తీసుకొని 1 స్పూన్ పసుపు పొడి కలిపి ఐదు నిమిషాలు మరగబెట్టాలి.తర్వాత గ్రీన్ టీ బ్యాగ్ వేసి వడగట్టుకుని రోజు అల్పాహారానికి ముందు తీసుకోవాలి.


                                                                                                                                                                                                         

మరింత సమాచారం తెలుసుకోండి: