మనందరికీ తెలిసినంత వరకు క్యారెట్లు అనేవి ఆరెంజ్ కలర్ లో ఉంటాయని.. కానీ మీరు ఎప్పుడైనా నల్ల రంగులో ఉండే క్యారెట్ లను చూసారా.. ఒకవేళ చూస్తే.. వాటిని దేనికి ఉపయోగిస్తారు..?వీటిని మనుషులు తినొచ్చా..? తింటే వీటి వల్ల ఎటువంటి ప్రయోజనం ఉంటుంది..?? వీటన్నింటినీ గురించి ఇప్పుడు మన సమీక్ష లో తెలుసుకుందాం...ఇక ఇలాంటి క్యారెట్‌లలో నలుపురంగులో ఉండే వాటిని 'కాలా గాజర్‌' అని అంటారు.. ఇవి ఒక్కోసారి బాగా నలుపుగా ఉంటాయి, కొన్నిసార్లు మాత్రం బీట్‌రూట్‌ రంగులో కనిపిస్తాయి. నిత్యం కనిపించే క్యారెట్లతో పోలిస్తే ఈ కాలా గాజర్‌ వల్ల ఎన్నో ఆరోగ్యప్రయోజనాలు కలుగుతాయి. కాకపోతే ఆరెంజ్‌ క్యారెట్లతో పోలిస్తే వీటి రుచి కాస్త భిన్నంగా ఉంటుంది..

1. ఈ క్యారెట్లలో ఆంథోసైనిన్‌ అనే కాంపౌండ్‌ వల్ల వాటికి నలుపు రంగు వస్తుంది. ఈ సమ్మేళనం క్యాన్సర్‌ కణాలతో పోరాడే శక్తిని మన శరీరానికి ఇస్తుంది.

2. ఆరెంజ్‌ క్యారెట్లలాగే ఇందులో కూడా బీటాకెరాటిన్‌ ఉంటుంది. ఇది కంటి చూపును మెరుగుపరుస్తుంది.

కంటి కణాలకు రక్షణగా నిలుస్తుంది.ముఖ్యంగా వీటిని  వయసు పైబడిన వారు తింటే వారికి కళ్లు బాగా కనిపిస్తాయి. కంటి చూపు అనేది మందగించదు..

3. వీటిలో పీచుపదార్థం అధికం. ఆరోగ్యవంతమైన జీర్ణక్రియకు ఎంతో తోడ్పడుతుంది. ఈ క్యారెట్లు తినడం వల్ల జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగవ్వడంతో పాటూ కొలెస్ట్రాల్‌ తగ్గుతుంది.

4. ఎక్కువమంది పెద్దవారిని వేధిస్తున్న సమస్య రుమటాయిడ్‌ ఆర్ధరైటిస్‌. క్యారెట్లలో ఉంటే యాంటీ ఇన్‌ఫ్లమ్మేటరీ, యాంటి ఆక్సిడెంట్‌ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆర్థరైటిస్‌ను నిరోధిస్తాయి.

5. వయసు పెరుగుతున్న కొద్దీ మతిమరుపు కొందరిలో కనిపిస్తుంది. అలాంటివారు బ్లాక్‌ క్యారెట్లను తినడం అలవాటు చేసుకోవాలి. ఇవి అల్జీమర్స్‌ ప్రభావాన్ని తగ్గిస్తాయి.

6. ఏవైనా అతిగా తింటే అనర్థమే. వీటిని కూడా ఎక్కువ మొత్తంలో తింటే అలర్జీలు, రక్తపోటులో హెచ్చుతగ్గుల సమస్యలు, చర్మం రంగు మారడం వంటివి రావచ్చు. పరిమితంగా తింటే మంచిది...!!

మరింత సమాచారం తెలుసుకోండి: