కొన్ని పరిస్థితుల్లో నెలసరిని వాయిదా వేయవలసి వస్తుంది. అటువంటి తప్పనిసరి పరిస్థితుల్లో పిల్స్ పై ఆధారపడవలసి వస్తుంది. ఐతే, పిల్స్ కాకుండా నేచురల్ ప్రాసెస్ లో కూడా పీరియడ్స్ ను డిలే చేయగలిగే అవకాశం ఉంది. మరి ఆ చిట్కాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

1. బొప్పాయి:

గర్భిణీలను బొప్పాయి పండుకు దూరంగా ఉండమని పెద్దలు చెబుతూ ఉంటారు. బొప్పాయి పండులో కెరోటిన్ సమృద్ధిగా లభిస్తుంది. ఇది ఈస్ట్రోజెన్ లెవెల్స్ ను పెంచుతుంది. దాంతో యుటెరిన్ బ్లడ్ ఫ్లోలో మార్పులు వస్తాయి. దాని వల్ల గర్భిణీల్లో మిస్ క్యారేజ్ ప్రమాదం తలెత్తే అవకాశం ఉంది. ఐతే, పీరియడ్స్ ను డిలే చేయాలని భావించేటప్పుడు బొప్పాయి మీకు ఎంతో సహాయపడుతుంది. బొప్పాయిని ఇందుకు వినియోగించడం సేఫ్ కూడా.  

2. నిమ్మరసం:

నిమ్మరసంలో సిట్రిక్ యాసిడ్ పుష్కలంగా లభిస్తుంది. పీరియడ్స్ కి ముందు లైమ్ జ్యూస్ ను తీసుకుంటే పీరియడ్స్ ఆలస్యమయ్యే అవకాశం  ఉంది. అలాగే పీరియడ్స్ లో ఫ్లో అనేది కూడా లైట్ గా అయ్యే అవకాశం ఉంది. పీరియడ్ కాంప్లికేషన్స్ ను తగ్గించడానికి కూడా నిమ్మరసం హెల్ప్ చేస్తుందని ఆరోగ్యనిపుణులు అంటున్నారు. పీరియడ్స్ రావడానికి రెండు రోజుల ముందు నుంచే నిమ్మరసాన్ని తీసుకుంటే ఎటువంటి ప్రాబ్లెమ్ లేకుండా పీరియడ్ అనేది డిలే అవుతుంది.

3. ఆపిల్ సైడర్ వినేగార్:

పీరియడ్స్ రావడానికి పది రోజుల ముందు నుంచే ఒక టీస్పూన్ ఆపిల్ సైడర్ వినేగార్ ను నీళ్ళల్లో కలిపి ఆ మిశ్రమాన్ని తీసుకుంటూ ఉంటే పీరియడ్స్ ఆలస్యమయ్యే అవకాశం ఉంది. అంతేకాదు, ఆపిల్ సైడర్ వినేగార్ వల్ల మరెన్నో హెల్త్ బెనిఫిట్స్ లభిస్తాయి. శరీరంలోని అదనపు ఫ్యాట్ కరుగుతుంది. అలాగే, టాక్సిన్స్  కూడా తొలగిపోతాయి.

4. ఆవాలు:

ఒక కప్పుడు వెచ్చటి పాలలో రెండు స్పూన్ల ఆవాల పొడిని కలిపి  ఈ పానియాన్ని పీరియడ్స్ రావడానికి వారం ముందు నుంచి తాగాలి. దీంతో, పీరియడ్స్ ఆలస్యమయ్యే అవకాశం ఉంది.

5. స్పైసీ ఫుడ్స్:

స్పైసీ ఫుడ్స్ అనేవి బ్లడ్ ఫ్లోను ఇంప్రూవ్ చేస్తాయి. మెన్స్ట్రువల్ సైకిల్ ను ఇంప్రూవ్ చేస్తాయి. ఒకవేళ, నెలసరిని పోస్ట్ పోన్ చేయాలని భావించినట్టైతే చిల్లీస్, పెప్పర్ అలాగే గార్లిక్ వంటి స్పైసీ ఫుడ్స్ ను అవాయిడ్ చేయాలి. పీరియడ్స్ రావడానికి కొన్ని రోజుల ముందు నుంచే వీటిని అవాయిడ్ చేయడం మంచిది. 

మరింత సమాచారం తెలుసుకోండి: