అంతర్జాతీయ ఆరోగ్య సంస్థ నిర్వహించిన ఒక సర్వేలో అన్ని వ్యాధులకు అంటే డయాబెటిస్ అతి వేగంగా పెరుగుతోందని సర్వేలో తేలింది. మారుతున్న ఆహారపు అలవాట్లు, వ్యాయామం లేకపోవడం వల్ల మధుమేహ వ్యాధిగ్రస్తులు విపరీతంగా పెరిగిపోతున్నారు.మధుమేహ వ్యాధిగ్రస్తులు ప్రతి రోజూ తీసుకునే మందులు, ఆహారపు అలవాట్లను,మార్చుకోవడం వల్ల షుగర్ లెవెల్స్ ని తొందరగా తగ్గించుకోవచ్చు.వ్యాధి ప్రాణాంతకమైన తే కాదు,జాగ్రత్తలు తీసుకొని, డైట్  ఫాలో అవుతే పేషెంట్లు కూడా నూరేళ్ళు బతకవచ్చని వైద్యులు తెలుపుతున్నారు. డయాబెటిస్ ఉన్న వాళ్ళు తీసుకోవలసిన ఆహార పదార్థాల గురించి తెలుసుకుందాం..

 ఆకుకూరలు తీసుకోవడం వల్ల షుగర్ లెవెల్స్ తగ్గుతాయి. ఎందుకంటే క్యాలరీలు తక్కువగా ఉంటాయి.దాల్చిన చెక్క ను తీసుకోవడం వల్ల షుగర్ లెవెల్స్ తగ్గుతాయి.

 గుడ్డులో ప్రొటీన్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి గుడ్డు తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది.పసుపు లో ఔషధ గుణాలు ఎక్కువగా ఉంటాయి.పసుపు తీసుకోవడం వల్ల డయాబెటిస్ వల్ల ఏర్పడే కిడ్నీ సమస్యలను నయం చేస్తుంది.

 పెరుగు కూడా షుగర్ లెవల్స్ ను తగ్గిస్తుంది.  రోజులో పెరుగును ఎక్కువగా తీసుకోవాలి.అలాగే పిండి పదార్థాలు తీసుకోవడం వల్ల షుగర్ లెవెల్స్ ను తగ్గించుకోవచ్చు.

 మధుమేహం ఉన్నవాళ్లు కాకరకాయను తీసుకోవడం వల్ల చాలా మంచిది. కాకరకాయ రక్తంలో చక్కెర నిల్వలను పెరగకుండా నియంత్రిస్తుంది. ఎందుకంటే కాకరకాయలు ప్లాంట్ ఇన్సులిన్ అధికంగా ఉంటుంది. ఇది బ్లడ్ షుగర్ స్థాయిలను సమర్థవంతంగా నియంత్రిస్తుంది.

 మధుమేహ వ్యాధిగ్రస్తులు ఒక టేబుల్ స్పూన్ మెంతులను తీసుకొని రాత్రి నాన బెట్టి ఉదయం లేవగానే ఆ నీటిని తాగాలి. ఇలా చేయడం వల్ల షుగర్ లెవెల్స్ తగ్గుతాయి.

 వెల్లుల్లి తీసుకోవడం వల్ల రక్తపోటును నియంత్రణలో ఉంచి,డయాబెటిస్ ను కూడా నియంత్రిస్తుంది. ఎందుకంటే వెల్లుల్లిలో జింక్, సల్ఫర్,ఇన్సిలిన్ కాంపోనెంట్స్ ఉంటాయి.

 బీన్స్ తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. ఎందుకంటే ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. జీర్ణ వ్యవస్థలో ఎక్కువసేపు ఉంటుంది.దీంతో కడుపు నిండిన భావన కలుగుతుంది. కాబట్టి బరువు తగ్గాలనుకునే వాళ్ళు, మధుమేహ వ్యాధిగ్రస్తులు బీన్స్ తీసుకోవడం వల్ల షుగర్ లెవెల్స్ కూడా తగ్గుతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: