కరక్కాయ తీసుకోవడం వల్ల అనేక రోగాలకు చెక్ పెట్టొచ్చు.కరక్కాయ లో ఔషధ గుణాలు మెండుగా ఉన్నాయి. ముఖ్యంగా వాతానికి సంబంధించిన గుణాలను తగ్గించడంలో ముందుంటుంది. అంతేకాకుండా ఆయుష్షును పెంచుతుంది. మలబద్ధకాన్ని నివారించడానికి బాగా సహాయపడుతుంది. కరక్కాయ తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకుందాం..

 కరక్కాయ ముక్కను తీసుకొని బుగ్గన పెట్టుకోవడం వల్ల దగ్గు నుంచి ఉపశమనం కలుగుతుంది.దీనికి చలువచేసే గుణాలు కూడా ఉన్నాయి.

 గుండె బలంగా ఉండాలంటే కొన్ని కాకరకాయ ముక్కలను నీళ్ళల్లో నానబెట్టి ఆ నీటిని తాగడం వల్ల గుండె సమస్యలు ఉన్నా తగ్గిపోతాయి.

 వాంతులు ఎక్కువగా అవుతున్నప్పుడు కరక్కాయ పొడిని తీసుకొని గ్లాస్ నీళ్లలో వేసి తాగుతూ ఉండడంవల్ల, వాంతులు తగ్గుతాయి.ఇంకా కడుపుబ్బరం, ఎక్కిళ్ళు వంటి కూడా తగ్గుతాయి.

తలనొప్పి, కళ్ళు మంటలు ఉంటే కరక్కాయను నున్నగా నూరి మొదటి మీద పోయడం వల్ల తలనొప్పి తగ్గడమే కాకుండా, కళ్ళు మంటలు కూడా తగ్గుతాయి.అలాగే కరక్కాయ పొడి కి కొంచెం ఉప్పు కలిపి పళ్ళు తోముకోవడం వల్ల చిగుళ్ళు గట్టి పడి వే కాకుండా దంత వ్యాధులు వంటివి రావు.

 రక్త మొలలతో బాధపడుతున్న వాళ్లు కరక్కాయ చూర్ణాన్ని కి కొంచెం బెల్లం కలిపి ప్రతిరోజు భోజనానికి 30 నిమిషాల ముందు అర టీ స్పూన్ పొడిని రెండుపూటలా తీసుకోవడం వల్ల రక్త మొలలు తగ్గుతాయి.

దగ్గు, ఆయాసం ఎక్కువగా ఉన్నప్పుడు కరక్కాయ,శొంఠి, తానికాయ,పిప్పిళ్ళు అన్నింటినీ సమానంగా తీసుకొని పొడి కొట్టుకోవాలి. ఈ పొడిని అర టీ స్పూన్ చొప్పున రోజూ మూడు పూటలా తేనెతో కలిపి తీసుకోవడం వల్ల దగ్గు, ఆయాసం తగ్గిపోతాయి.

 కరక్కాయ చూర్ణాన్ని రోజూ రెండు పూటలా ఆముదంతో కలిపి తీసుకుంటుంటే కీళ్ల నొప్పులు తగ్గుతాయి.                                                                                                           

మరింత సమాచారం తెలుసుకోండి: