గడిచిన గత పది నెలల కాలంలో దేశంలోని అన్ని రాష్ట్రాల ప్రజలు ఈ కరోనా వైరస్ మహమ్మారి కారణంగా అనేక ఇబ్బందులకు గురయ్యారు. మరీ ముఖ్యంగా వృద్ధులు, గర్భిణీ స్త్రీలు అలాగే దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న పలువురు వ్యక్తులు ఈ కరోనా వైరస్ మహమ్మారి కారణంగా అనేక విధాలుగా సతమతం అయ్యారు, అలాగే నేటికీ ఇంకా ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఈ కరోనా వైరస్ మహమ్మారి నిర్మూలనకు వ్యాక్సిన్ అందుబాటులోకి రావటంతో ప్రజలు అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ముందుగా దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రధాన ప్రాంతాలలో వ్యాక్సిన్ డ్రైన్ భారీ ఎత్తున నిర్వహించటం తెలిసిందే. ఇక ఆ తర్వాత ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని భారత్ జనవరి 16న ప్రారంభించింది.




సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఉత్పత్తి చేస్తోన్న కోవిషీల్డ్, భారత్ బయోటెక్ ఉత్పత్తి చేస్తోన్న కొవాగ్జిన్ వ్యాక్సిన్‌ను దేశ ప్రజలకు టీకాలుగా వేస్తున్నారు. వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభించిన మూడు రోజుల తర్వాత ఈ వ్యాక్సిన్ ను ఎవరు తీసుకోకూడదు అనే విషయాలను తెలుపుతూ భారత్ బయోటెక్ ఫ్యాక్ట్ షీట్‌ను జారీ చేసింది. భారత్‌ బయోటెక్ వెబ్‌సైట్లో పోస్ట్ చేసిన ఈ ఫ్యాక్ట్ షీట్ ప్రకారం.. అలర్జీలు, జ్వరం లేదా బ్లీడింగ్ డిజార్డర్, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న వారు, రోగ నిరోధక శక్తిని ప్రభావితం చేసే ఔషధాలు తీసుకుంటున్నవారు.. వ్యాక్సిన్‌కు దూరంగా ఉండాలి. గర్భిణులు, పాలిచ్చేవారు కొవాగ్జిన్‌కు దూరంగా ఉండాలని భారత్ బయోటెక్ సూచించింది. కోవిడ్ వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకోవాల్సి ఉండగా.. తొలి డోస్ వేరే వ్యాక్సిన్ తీసుకున్న వారు.. రెండో డోస్ తమ వ్యాక్సిన్ వేయించుకోవద్దని తెలిపింది. నొప్పి, వాపు లేదా దురద, జ్వరం, నీరసంగా ఉండటం, దద్దుర్లు, వాంతులు తదితర సైడ్ ఎఫెక్ట్‌లు ఉంటాయని భారత్ బయోటెక్ తెలిపింది. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, గొంతు మరియు ముఖం వాపు, గుండె వేగంగా కొట్టుకోవడం, ఒళ్లంతా దద్దుర్లు రావడం, అలసట, నీరసంగా అనిపించడం లాంటి లక్షణాలు కూడా కనిపించొచ్చని తెలిపింది.

మరింత సమాచారం తెలుసుకోండి: