మొదటగా సైనసైటిస్ అంటే ఏమిటో తెలుసుకుందాం..
సైనసైటిస్ అంటే మన ముక్కులో ఉండే గాలి గదులను సైనస్ అని అంటారు. ఇవి వాపుకు గురికావడం వల్ల మన రోజువారీ పనులకు ఆటంకం కలిగిస్తూనే, మనల్ని ప్రశాంతంగా ఉండనివ్వని స్థితికి వస్తాము దీనినే   సైనసైటిస్ అంటారు.

ముఖ్యంగా చెవి,ముక్కు, గొంతు ఒకదానితో ఒకటి అనుసంధానమై ఉంటాయి. వీటిలో ఏ ఒక్కటి అయినా సమస్యకు గురి అయినప్పుడు  మిగతా రెండూ  కూడా సమస్య బారినపడినట్టే. మనం ముఖ్యంగా శ్వాస తీసుకోవాలన్నా,వాసన చూడాలన్నా, ఒక పదార్థాన్ని ఆస్వాదించాలన్నా  కేవలం ముక్కు వలనే సాధ్యం. అలాంటిది ఏవో చిన్న కారణాల చేత ముక్కు లోపల ఏదైనా సమస్య ఏర్పడితే,ఇక అంతే. ధ్యాస మొత్తం ముక్కు పైనే ఉంటుంది. ఏ పనిని సక్రమంగా చేసుకోలేని స్థితికి చేరుకుంటాము. అయితే ముందుగా ఈ సైనసైటిస్ రావడానికి కారణాలు ఏంటి? ఒకవేళ వస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అనే విషయాన్ని ఇప్పుడు మనం చర్చించుకుందాం.

ముఖ్యంగా సైనసైటిస్ వాతావరణంలో కలిగే మార్పుల వల్ల వస్తుంటుంది. ముఖ్యంగా శీతాకాలంలో  ఈ సమస్యను ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇంకా ఇన్ఫెక్షన్ల కారణంగా కూడా సైనసైటిస్ వచ్చే అవకాశం ఉంది. శ్వాసకోశ వ్యాధులు, ఊపిరితిత్తుల వ్యాధులు వంటివి ఏర్పడినప్పుడు కూడా సైనసైటిస్ వచ్చే అవకాశాలు ఎక్కువ. ఎక్కువగా  ధూమపానం చేసేవారు ఈ సైనసైటిస్ బారినపడక తప్పదు.అలర్జీలు, జలుబు, దగ్గు వంటి సమస్యలు ఉన్నప్పుడు నిర్లక్ష్యం చేయడం, గొంతు నొప్పి,పన్ను నొప్పి, టాన్సిల్స్ వల్ల దవడ తోపాటు  గొంతు వాపు రావడం. ఇలాంటి కారణాల వల్ల మన శరీరంలో రోగ నిరోధక శక్తి తగ్గి, క్రమంగా సైనస్ సమస్య తీవ్రత ఎక్కువవుతుంది.

సైనసైటిస్ లక్షణాలు ఏమిటంటే?జ్వరం రావడం, రాత్రిపూట దగ్గు ఎక్కువ అవడం, నుదురు వేడిగా, నొప్పిగా ఉండడం. ముక్కు నుండి పసుపు, తెలుపు రంగులో   చిక్కటి ద్రవంలాగ  రావడం, ఆకలి లేకపోవడం, తలనొప్పి,ముక్కు నొప్పి, ముఖం ఉబ్బినట్టు ఉండడం లాంటి లక్షణాలను సైనసైటిస్ గా గుర్తించవచ్చు.

సైనసైటిస్ సమస్యకు చెక్ పెట్టాలంటే, ఎక్కువగా ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి. అవకాడోలో ఒమేగా త్రీ కొవ్వులు ఎక్కువగా ఉంటాయి.కాబట్టి వాటిని తరచూ తింటూ  ఉండడం వల్ల సైనసైటిస్ ను కొంత  వరకు అరికట్టవచ్చు. బీన్స్ మొలకలలో ఎక్కువగా క్యాల్షియం,విటమిన్ సి ఉంటాయి. ఇవి రోగనిరోధకశక్తిని పెంచడానికి సహాయపడతాయి. అంతేకాకుండా బాగా మరిగించిన నీటిలో నీలగిరి తైలం లేదా అమృతాంజన్ వేసుకొని, వేడి నీటిలో ఆవిరి  పట్టుకోవడం వల్ల కూడా కొంత ఉపశమనం లభిస్తుంది. శరీరం ఎక్కువ డీహైడ్రేట్ అవ్వకుండా చూసుకోవాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: