మన భారతీయ సంప్రదాయం ప్రకారం ఏ పండుగ వచ్చినా ఉపవాసం చేయడం అలవాటైపోయింది. అంతేకాకుండా మనలో చాలా మంది మహిళలతో పాటు పురుషులు కూడా ఈ మధ్యకాలంలో ఉపవాసం చేయడం ఎక్కువగా చూస్తున్నాము. సోమవారం మొదలుకొని ఆదివారం వరకు ఏదో ఒక దేవుడి పేరు పైన ఉపవాసాలు ఉండటం అలవాటుగా మారిపోయింది. మనలో చాలామంది ఉపవాసం చేస్తే దేవుడు మనల్ని అనుగ్రహిస్తాడు అన్న అపోహతోనే చాలామంది ఉపవాసం ఉంటున్నారు. అయితే ఉపవాసం చేయడం వల్ల దేవుడు అనుగ్రహిస్తాడో?లేదో? తెలియదు కానీ ఆరోగ్యానికి మాత్రం ఎంతో ప్రయోజనం అని నిపుణులు సూచిస్తున్నారు.అయితే ఆ ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకుందాం.


వారానికి ఒకసారి ఉపవాసం చేయడం వల్ల శరీరంలోని విషపదార్థాలు ,వ్యర్ధాలు బయటకు వెళ్ళిపోతాయి.తద్వారా  ఉపవాసం చేయడం వల్ల జీర్ణ వ్యవస్థకు విశ్రాంతి కలుగుతుంది. ఫలితంగా జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది. ఇక వారానికి ఒకసారి ఉపవాసం చేయడం వల్ల రోగ నిరోధక శక్తి పెరగడంతో పాటు అనేక జబ్బుల బారిన పడకుండా మన శరీరాన్ని కాపాడుకోవచ్చు. శరీరంలో అదనంగా పేరుకుపోయిన కొవ్వు నిల్వలను తగ్గించి, శరీరం తేలిక పడేలా చేస్తుంది. అంతేకాకుండా రక్తం లోని చెడు కొలెస్ట్రాల్ ను కూడా దూరం చేస్తుంది. ఫలితంగా  అధిక బరువుతో పాటు గుండె సంబంధిత జబ్బులను కూడా దూరం చేసుకోవచ్చు.

వారానికి ఒకసారి ఉపవాసం చేయడం వల్ల మధుమేహాన్ని కూడా అరికడుతుంది.అంతేకాకుండా అధిక రక్తపోటును అదుపు చేయడంలో ఉపవాసం ఎంతో ఉపయోగపడుతుంది.  అలాగే వారానికి ఒకసారి ఉపవాసం చేయడం వల్ల శరీరం యొక్క ఇన్సులిన్ సున్నితత్వాన్ని పెంచుతుంది. కాబట్టి ఇన్ని ప్రయోజనాలున్న ఉపవాసాన్ని మాత్రం తప్పకుండా వారానికి ఒకసారి  మాత్రమే ట్రై చేయండి.

అయితే లోబీపీ ఉన్నవారు  ఉపవాసానికి దూరంగా ఉంటేనే మంచిది. అనారోగ్యంతో ఉన్నవారు, గర్భవతులు,ఏవైనా మందులు వాడేవారు, పాలిచ్చే తల్లులు కూడా ఉపవాసం చేయకపోవడమే మంచిది.అయితే ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొనే వారు ఉపవాసం చేయకపోవడమే మంచిది.

మరింత సమాచారం తెలుసుకోండి: