సాధారణంగా గుమ్మడికాయ అంటే చాలామంది తినడానికి ఇష్టపడరు. కానీ అందులో ఉండే లాభాలు ఏంటో తెలిస్తే మాత్రం ఖచ్చితంగా తినడం మొదలు పెడతారు. గుమ్మడికాయలో మాత్రమే కాకుండా గుమ్మడి గింజల్లో కూడా ఎన్నో పోషక విలువలు ఉన్నాయని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ప్రస్తుతం ఎదుర్కొంటున్న కరోనా వైరస్,బర్డ్ ఫ్లూ వంటి వైరస్ ల  నుంచి మనల్ని మనం కాపాడుకోవాలి అంటే మాత్రం కచ్చితంగా గుమ్మడికాయతో పాటు గుమ్మడి గింజలను కూడా ఆహారంలో చేర్చుకోవాలి అని నిపుణులు  సూచిస్తున్నారు. అయితే గుమ్మడి కాయ మనకు ఏవిధంగా ఉపయోగపడుతుందో ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకుందాం.

గుమ్మడి కాయ లో ముఖ్యంగా విటమిన్స్,మినరల్స్, ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్ లు శరీరానికి పుష్కలంగా అందుతాయి. శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతాయి. గుమ్మడికాయను రోజువారీ ఆహారంలో భాగంగా చేసుకుంటే చర్మ సంబంధిత వ్యాధులను మొదలుకొని డయాబెటిస్ను కంట్రోల్ చేసే వరకు ఎన్నో జబ్బులను నయం చేస్తుంది. ఇందులో ముఖ్యంగా విటమిన్ ఎ, విటమిన్ ఇ, విటమిన్ కె తో పాటు పొటాషియం, పాస్ఫరస్,ఐరన్, మెగ్నీషియం, క్యాల్షియం వంటి మినరల్స్ కూడా ఉన్నాయి అందుకే రోజూవారి ఆహారంలో గుమ్మడికాయను చేర్చుకోవడం మంచిదని అంటున్నారు నిపుణులు.

విటమిన్-సి వల్ల గుండె జబ్బులు,ఆస్తమా వంటి సమస్యలు దరిచేరవు. అంతేకాకుండా ఫ్లూ, జలుబు వంటి సమస్యల నుంచి కూడా మనల్ని మనం కాపాడుకోవచ్చు. ఇక గుమ్మడికాయ గుజ్జులో ఉండే బీటా కెరోటిన్ ఇమ్యూనిటీని పెంచేందుకు సహాయపడుతుంది. అంతేకాకుండా కొన్ని క్యాన్సర్ల నుంచి మనల్ని కాపాడుతుంది.

బ్రెస్ట్ క్యాన్సర్కు సంబంధించి మెనోపాజ్ దశలో అడుగుపెట్టిన మహిళలు గుమ్మడి గింజలు తింటే చాలా మంచిది.హార్మోన్స్  ఇన్ బ్యాలెన్స్ ప్రాబ్లం నుంచి రిలీఫ్ నిస్తుంది. అంతే కాకుండా బరువు తగ్గాలనుకునే వారు కూడా గుమ్మడి కాయలను పుష్కలంగా తినవచ్చు. అంతేకాకుండా డయాబెటిస్ ని కూడా కంట్రోల్ చేసే శక్తి గుమ్మడికాయ ఉంది. కాబట్టి గుమ్మడి కాయ తోపాటు గుమ్మడి గింజలను  కూడా ఆహారంలో చేర్చుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: