సాధారణంగా బరువు ఎక్కువగా ఉన్నా, బరువు తక్కువగా  ఉన్నా మన ఆరోగ్యానికి మంచిది కాదు.   మరీ సన్నగా ఉన్నా  అనారోగ్య సమస్యలతో ప్రమాదమే. కాబట్టి మనం మన ఎత్తుకు తగ్గ శరీర బరువు కలిగి ఉండటం చాలా మంచిది. మనం తినే ఆహారానికి సమానమైన పని చేసినప్పుడు ఏ విధమైన అనారోగ్య సమస్య ఉండదు.అలా కాకుండా కేలరీలు తక్కువగా తీసుకుని పని ఎక్కువ చేస్తే ఎక్కువ కేలరీలు ఖర్చవుతాయి. కాబట్టి మన శరీరానికి తగిన మోతాదులో పోషకాలు లభించక  శరీర బరువు తగ్గి చిన్నగా కనిపిస్తారు. ఇలాంటి వారు బరువును తగ్గించుకోవడానికి  జంక్ ఫుడ్, ఆయిల్ ఫుడ్‌లు ఎక్కువగా తింటుంటారు. అయితే వీటి కారణంగా పొట్టలో క్రొవ్వు పేరుకుపోతుంది తప్ప లావు మాత్రం కారు. సన్నగా ఉన్నవారు బరువు పెరగడానికి కొన్ని సులువైన మార్గాలను ఇక్కడ తెలుసుకుందాం.       

శరీర బరువు పెంచుకోవడానికి ఎక్కువ క్యాలరీలు అవసరం. అలాంటి వారు పాలు, అరటిపండు, నెయ్యి ఖర్జూరాలు వంటి అధిక ప్రోటీన్స్ కలిగిన ఆహారాన్ని తీసుకోవాలి.            
 
బరువు పెరగాలనుకొనే వారు వారి ఆహారంలో రోజుకి రెండు గుడ్లు తప్పనిసరి గుడ్డు సొనలో మంచి   కొలెస్ట్రాల్ ఉంటాయి ఇవి శరీర బరువును పెంచడానికి తోడ్పడతాయి.

బరువు పెరగాలనుకొనే వారు ఎక్కువగా సహజ వెన్నను , పెరుగును ఆహారంగా తీసుకోవడం మంచిది.          

రోజుకు రెండు సాల్మన్ చేపలు ఆహారంగా తీసుకుంటే మాంసకృత్తులు సరిగ్గా వంట పట్టి క్రమంగా బరువు పెరుగుతారు.

రోజూ ఆహారంలో బంగాళదుంపలు తీసుకుంటే అందులో ఉండే పిండి పదార్థాలు , ప్రోటీన్స్, చక్కెర నిల్వలు సమృద్ధిగా లభించి బరువు పెరగడానికి తోడ్పడతాయి.                                                   

మరింత సమాచారం తెలుసుకోండి: