యాలకలు సుగంధ ద్రవ్యాలు,వీటిని వంటకాలలో వాడుతారు. తీపి పదార్థాల తయారీలో వాడుతారు. మసాలా టి లో కూడా వాడతారు. యాలుకలు వేయడం వల్ల వంటలు రుచితో పాటు సువాసన వస్తుంటాయి.అంతేకాకుండా యాలుకలు తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ఆ ఆరోగ్య  ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం...                                                 

 డిప్రెషన్ నుంచి బయటపడాలంటే యాలకలను టీ లో కానీ, పాలలో కానీ వేసుకొని తాగడం మంచిది.జీర్ణ వ్యవస్థను కూడా మెరుగుపరుస్తాయి. అంతేకాకుండా క్యాన్సర్ వంటి వ్యాధులను రాకుండా కాపాడుతాయి.

 యాలుకల్లో  సీనియల్ కాంపౌండు ఉండటంవల్ల పురుషుల్లో నరాల పటిష్టతకు ఉపయోగపడుతుంది.సంతాన సాఫల్యత పెంచడంలో యాలకలు ముందుంటాయి.రోజూ యాలకల పొడిని తీసుకోవడం వల్ల లైంగిక సామర్థ్యం పెరుగుతుందని డాక్టర్లు సూచిస్తున్నారు.నరాల బలహీనత కూడా తొలగిస్తుంది.

 యాలకుల్లో మెటబాలిజంను మెరుగుపరిచే గుణాలు అధికంగా ఉన్నాయి. ఇవి జీర్ణక్రియను సక్రమంగా జరిగేటట్లు చేస్తాయి.అంతేకాకుండా కడుపులో వచ్చే నొప్పి, వంట నుండి కూడా ఉపశమనం కలిగిస్తాయి.

 యాలుకల్లో పొటాషియం, క్యాల్షియం, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి.పొటాషియమ్ గుండె పనితీరును మెరుగు మెరుగుపరిచి అధిక రక్తపోటును అదుపులో ఉంచుతుంది.

 యాలుకల్లో క్యాన్సర్ ను సహజసిద్ధంగా తగ్గించే గుణాలు ఉంటాయి.క్యాన్సర్ వస్తే పెరగకుండా యాలుకలు అడ్డుకుంటాయి.క్యాన్సర్ ను తగ్గించే లక్షణాలు కూడా ఉన్నాయి.

 యాలకులు తినడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది.ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్ గుణాలు గుండెకు చాలా మంచి చేస్తాయి.వీటిలో ఉండే ఫైబర్ మరియు పోషకాలు కొలెస్ట్రాల్ లెవెల్స్ను తగ్గించడమే కాకుండా గుండెకు రక్తం సరఫరా సక్రమంగా జరిగేటట్లు చేస్తాయి.

 యాలకల్లో మాంగనీస్ అధికంగా ఉండటం వల్ల డయాబెటిస్ రిస్కు నుంచి కాపాడుతుంది.కాబట్టి డయాబెటిస్ రోగులు యాలకలను తీసుకోవడం చాలా మంచిది.

మరింత సమాచారం తెలుసుకోండి: