ఆముదమును  ఒక చెట్టు గింజ నుండి తయారు చేస్తారు. ఆముదము ఎక్కువగా దీపాలు వెలిగించటానికి ఉపయోగిస్తారు.ఇంకా తల కూడా పట్టించుకుంటారు.జుట్టు ఆరోగ్యంగా ఉండటానికి ఉపయోగపడుతుంది.అంతేకాకుండా గుండె జబ్బులు. విషజ్వరము,కుష్టు, దురద, వాపు, మలమూత్ర సంబంధించిన సమస్యలను సులువుగా నివారిస్తుంది.అందానికి కూడా ఆముదాన్ని ఉపయోగిస్తారు.ఇంకా ఆముదాన్ని వాడడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు గురించి తెలుసుకుందాం..                                                  

 మలబద్దక సమస్య ఉన్నవాళ్లు ఆముదాన్ని తీసుకోవడం వల్ల మలబద్దక సమస్య నుండి భక్తి కలుగుతుంది.ఆముదము లో ఉండే రికినోలియక్ యాసిడ్ ఉంటుంది. ఇది పేగుల్లో ఉండే మలమును సులభంగా బయటకు పంపుతుంది.

 ఆముదము లో ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి.ఇవి ఆరోగ్యవంతమైన చర్మకణాలను, కాంతివంతమైన చర్మాన్ని వృద్ధి చేస్తాయి.అలాగే చర్మం పై పడిన ముడుతలను పోగొడతాయి.

ఆముదము లో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి నొప్పులు తగ్గడానికి సహాయపడతాయి. నొప్పి ఉన్న చోట ఆముదమును వేడి చేసి రాయడం వల్ల నొప్పి తగ్గుతుంది.

 ఆముదాన్ని నెలకు ఒకసారైనా తాగడం వల్ల కడుపు శుభ్రపడుతుంది.ప్రతిరోజు తలకు రాసుకోవడం వల్ల జుట్టు ఆరోగ్యంగా పెరుగుతుంది.చర్మానికి రాసుకోవడం వల్ల చర్మం మృదువుగా ఉంటుంది.

 జుట్టు అందంగా కనపడటానికి ఆముదము నూనె రాసుకోవాలి. ఇది జుట్టు రాలడాన్ని తగ్గించడమే కాకుండా,  చుండ్రు, దురద సమస్యల నుండి కాపాడుతుంది.

ఆముదము ఆకుల నుండి రసం తీసి అందులోకి కొంచెం అల్లం రసం, నువ్వుల నూనె,అతిమధురం,ఉప్పు కలిపి
 మరిగించి దాన్ని వడబోయాలి.  ఈ తైలాన్ని చెవిపోటు ఉన్నవాళ్లకి బాగా పనిచేస్తుంది.

 అరికాళ్ళు మంటలు గా ఉంటే ఆముదమును, కొబ్బరి నూనెను సమానముగా తీసుకొని,అరి కాళ్లకు మర్దన చేయడం వల్ల మంటలు తగ్గుతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: