సబ్జా చూడటానికి నల్లగా ఉంటాయి. వీటిని నీళ్ళల్లో నాన పెడితే బాగా ఉబ్బి జెల్ లా తయారవుతాయి.ఈ సబ్జా గింజలు తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. సబ్జా గింజలను నీటిలో నానబెట్టి ఆ నీటిని తాగడం వల్ల బరువు తగ్గే అవకాశం ఉంది.బరువు తగ్గాలనుకొనే వారికి సబ్జా గింజలు బాగా ఉపయోగపడతాయని పోషకాహార నిపుణులు సలహా ఇస్తున్నారు.సబ్జా గింజలను తీసుకోవడం వల్ల మనకు కలిగే ఆరోగ్య ప్రయోజనాలు గురించి తెలుసుకుందాం..              

 సబ్జా గింజలను నీటిలో నానబెట్టడం వల్ల రెండింతలు పెరుగుతాయి. అందుకే సబ్జా గింజలు తీసుకోవడం వల్ల త్వరగా కడుపు నిండిన భావన కలుగుతుంది. ఆకలి అనిపించదు తక్కువగా తింటారు కాబట్టి బరువు తగ్గుతారు.

 సబ్జా గింజలు జిగురుగా ఉంటాయి.ఔషధ గుణాలు కూడా అధికంగా ఉన్నాయి. అందుకే శరీర ఉష్ణోగ్రతను తగ్గించడానికి సబ్జా గింజలు సహాయపడతాయి. అంతేకాకుండా మూత్ర సమస్యలను కూడా నివారిస్తాయి.

 శరీరంపై దెబ్బలు తగిలినప్పుడు సబ్జా గింజలను బాగా నూరి నూనె కలిపి దెబ్బల పై, గాయాల పైన రాయడం వల్ల అవి తొందరగా మానిపోతాయి.

 సబ్జా గింజలు నీటిలో నాన పెట్టుకొని అవి బాగా వేగిన తర్వాత ఆ నీటిని తాగడం వల్ల తలనొప్పి, మైగ్రేన్ వంటి సమస్యలు తగ్గుతాయి. మానసిక ప్రశాంతత కూడా లభిస్తుంది.

 నానబెట్టిన సబ్జా గింజలు,అల్లం రసం, తేనె మూడింటిని కలిపి గోరువెచ్చని నీటితో తాగడం వల్ల శ్వాస సంబంధ వ్యాధులు తగ్గిపోతాయి.

నీటిలో నానబెట్టిన గింజలు తీసుకోవడం వల్ల గొంతులో మంట, ఆస్తమా,  తీవ్రమైన జ్వరము,తలనొప్పి వంటి సమస్యలు తగ్గుతాయి.

 సబ్జా గింజలను రోజూ తీసుకోవడం వల్ల బిపి అదుపులో ఉంటుంది.బ్యాక్టీరియా సంబంధిత సమస్యలను కూడా నివారిస్తాయి.

 సబ్జా గింజల్లో ఒమేగా 3 ఫ్యాటి ఆసిడ్లు అధికంగా ఉంటాయి.అందుకే గింజలను తీసుకోవడం వల్ల ఆర్థరైటిస్,గుండె సమస్యలు రాకుండా ఉంటాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: