ప్రస్తుత కాలంలో చాలా మంది రైస్ తీసుకుంటే బరువు పెరుగుతారనే అపోహతో రైస్ తినడానికి ఇష్టపడరు. కానీ ప్రపంచ వ్యాప్తంగా దాదాపు సగం జనానికి జీవనాధారం రైస్. ఆధునిక గజిబిజి జీవితంలో అసలు అన్నం కంటే గోధుమలు,జొన్నలు మంచివా..?లేదా పండ్లు,కూరగాయలు, ఆకుకూరలు మంచివా..? అని ఆలోచనలో పడుతున్నారు.. అంతేకాకుండా చాలా మంది తెలుపు రంగులో ఉండే బియ్యం కంటే బ్రౌన్ రైస్ ఆరోగ్యానికి మంచిది అని ప్రచారం కూడా చేస్తున్నారు. కానీ ఇందులో ఏ మాత్రం నిజం లేదని.. బియ్యం ఏ రంగులో ఉన్నప్పటికీ అది ఆరోగ్యానికి మంచిదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అయితే రైస్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..


జీర్ణశక్తి :
రైస్ తేలిగ్గా జీర్ణం అవుతూ జీర్ణ వ్యవస్థను ఉత్తేజితం చేస్తుంది. రైస్ లో ఉండే ఫైబర్ మలబద్దకాన్ని నివారిస్తుంది. అంతేకాకుండా మన శరీరం డీహైడ్రేషన్ కు గురైనప్పుడు దానినుంచి తప్పిస్తుంది..

రక్తపోటు, మధుమేహం నుండి రక్షణ :
మధుమేహ బాధితులు రైస్ తింటే అందులో వుండే గ్లూకోస్, రక్తం లోని చక్కర స్థాయిలను పెంచుతుందనే భ్రమ లో వున్నారు.. కానీ వాస్తవానికి ఒక కప్పు రైస్ తీసుకోవడం వల్ల ఈ రెండింటి వ్యాధుల నుంచి బయటపడవచ్చని వైద్యలు తెలుపుతున్నారు.

గుండె ఆరోగ్యాన్ని కాపాడే :
రైస్ తినడం వల్ల గుండె సంభందిత సమస్యలను చక్కగా ఎదుర్కొనే శక్తి మన శరీరానికి వస్తుంది. రైస్ లో ఉండే వాపు నివారించే గుణాలతో పాటు కొలెస్ట్రాల్ తక్కువగా ఉండటం వల్ల గుండెపోటును తగ్గించవచ్చు. ఆరోగ్యకరమైన గుండెకు రైస్ బ్రాన్ ఆయిల్ ఉపకరిస్తుంది. అంతేకాకుండా రైస్ లో ఉండే యాంటీ ఆక్సిడెంట్ గుణాలు కార్డియోవాస్క్యులర్  ఆరోగ్యానికి దోహదపడతాయి.

అధిక బరువు :
ఆరోగ్యకరమైన బరువును మెయింటైన్ చేయడంలో రైస్ మొదటి పాత్ర వహిస్తుంది. మన శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది. ఇందులో తక్కువ స్థాయిలో ఉండే సోడియం, కొలెస్ట్రాల్ లు బరువు పెరగడాన్ని నిరోధిస్తాయి. అన్నం బరువుపై ఎలాంటి ప్రతికూల ప్రభావం చూపదు. కాబట్టి ఒబేసిటీని నియంత్రించవచ్చు.

శక్తికి మూలం :
అలసట,ఆకలి తీవ్రంగా ఉన్నప్పుడు కొద్దిగా రైస్ తీసుకుంటే తక్షణ శక్తి లభిస్తుంది. రైస్ లో ఉండే కార్బోహైడ్రేట్లు శక్తిగా మారి మనకు అలసటను పోగొడతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: