తెలుగు సినీ పరిశ్రమలో ప్రముఖ హీరోయిన్లలో ఒకరిగా మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న హీరోయిన్లలో కాజల్ అగర్వాల్ ఒకరు అని చెప్పవచ్చు.ఎప్పుడు సోషల్ మీడియాలో ఎంతో చురుగ్గా ఉండే ఈమె తనకు సంబంధించిన విషయాలన్నింటినీ తన అభిమానులతో పంచుకుంటారు. ఈ నేపథ్యంలోనే "నాకు ఐదు సంవత్సరాల వయసున్నప్పుడు బ్రాంకియల్ ఆస్తమా ఉందని తెలిసింది". అంటూ తాజాగా కాజల్ అగర్వాల్ తెలియజేశారు.                                                        

చిన్నప్పుడు ఈ సమస్యతో బాధపడటం వల్ల ఆహార విషయంలో ఎన్నో జాగ్రత్తలు పాటిస్తూ ఆంక్షలు విధించడం నాకు ఇప్పటికీ గుర్తుందంటూ కాజల్ అగర్వాల్ తెలిపారు. అదే విధంగా ప్రతి సంవత్సరం శీతాకాలంలో ఎక్కువ చలి తీవ్రత, దుమ్ము ధూళి లోకి వెళ్ళిన ప్రతి సారి ఈ సమస్య వేధించేది. ఆ సమస్య నుంచి బయటపడటం కోసం ఇన్ హేలర్ ఉపయోగించడం వల్ల ఎంతో ఉపశమనం లభించింది.అప్పటినుంచి ప్రతి సారి బయటకు వెళ్ళేటప్పుడు తనతో పాటు ఇన్ హెలార్ తప్పకుండా ఉంటుందని ఈ సందర్భంగా కాజల్ తెలియజేశారు.

మన దేశంలో చాలా మంది ఇటువంటి సమస్యతో బాధపడుతున్నారు. అయితే ఈ సమస్యతో బాధపడే వారు బయటకు వెళ్లేటప్పుడు వారితోపాటు ఇన్ హేలర్ తీసుకుపోవడానికి ఎంతో మొహమాట పడుతుంటారు. అయితే ఈ సమస్య బాధిస్తున్నప్పుడు ఇన్ హేలర్ పబ్లిక్ గా అయినా, ప్రైవేట్ గా అయినా ఇన్ హెలర్ వాడటానికి సంకోచం చెందాల్సిన పనిలేదు. ఈ విషయంలో ప్రతి ఒక్కరికి ఈ విషయం పై అవగాహన కలిగేలా చేద్దాం.. "సే ఎస్ టు ఇన్‌హెలర్స్‌'' అంటూ కాజల్ అగర్వాల్ సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు

మరింత సమాచారం తెలుసుకోండి: