ఎరుపు రంగులో ఉండి చూడగానే తినాలనిపించే టటువంటి ఈ స్ట్రాబెర్రీస్ ను ఇష్టపడని వారంటూ ఎవరూ ఉండరు.ఈ స్ట్రాబెర్రీస్ ప్రత్యేకత ఏమిటంటే ఇందులో పండు లోపల ఉండాల్సిన విత్తనాలు బయట కనిపించడం దీని ప్రత్యేకత. ఈ స్ట్రాబెర్రీస్ చూడటానికి ఎంతో ఆకర్షణగా ఉండటం వల్ల చాలా మంది వీటిని తింటారు. అయితే నిజానికి ఈ స్ట్రాబెర్రీస్ తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.స్ట్రాబెర్రీస్ తీసుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇక్కడ తెలుసుకుందాం....                              

స్ట్రాబెర్రీస్ చూడటానికి చిన్న పరిమాణంలో ఉండి ఎర్రగా కనిపించేటటువంటి ఈ పండ్లు ఎక్కువగా అటవీ ప్రాంతాలలో పండుతాయి. వీటిలో అధిక శాతం విటమిన్ సి ఉంటుంది. స్ట్రాబెర్రీస్ లో మన శరీరానికి అవసరమైనటువంటి పోషకాలు మెండుగా ఉంటాయి. మాంగనీస్, ఫోలేట్, పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి.                                     

స్ట్రాబెర్రీస్ తినడం వల్ల కలిగే ప్రయోజనాలు:

*ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు ఉండటం వల్ల మన శరీరంలోకి ప్రవేశించే వ్యాధికారక బ్యాక్టీరియాలతో పోరాడి వాటిని నాశనం చేస్తాయి.యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలో ఏర్పడినటువంటి చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించి గుండె పనితీరును మెరుగుపరుస్తుంది. గుండె సమస్యతో బాధపడేవారు ఈ స్ట్రాబెర్రీస్ తినడం చాలా మంచిది.

*స్ట్రాబెర్రీస్ ను తరచూ తీసుకోవడం వల్ల జీర్ణ క్రియలో ఏర్పడేటటువంటి గ్లూకోజ్ స్థాయిలను తగ్గిస్తుంది. క్రమంగా ఇన్సులిన్ ,గ్లూకోజ్ స్థాయిలు సమానంగా ఉండటం వల్ల మధుమేహ వ్యాధి బారీన పడకుండా ఉండవచ్చు.

*స్ట్రాబెర్రీస్ లో విటమిన్ సి అధికంగా ఉండటం వల్ల కొంత పులుపుగా ఉంటుంది. అంతేకాకుండా విటమిన్ సి ఉండటం వల్ల మన శరీరానికి కావలసినంత రోగనిరోధక శక్తిని పెంపొందించడంలో కీలకపాత్ర పోషిస్తాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: