సాధారణంగా మనం తీసుకునే ఆహారం పోషక పదార్థాలతో నిండి ఉంటుంది. ఆహారంలో ఎన్నో రకాల విటమిన్స్, న్యూట్రియన్స్, ప్రోటీన్స్ పుష్కలంగా లభిస్తాయి. ఈ విధమైన ముఖ్య పోషకాలలో పొటాషియం కూడా ఒకటి. మనం తీసుకునే ఆహారంలో అధిక శాతం పొటాషియం ఉండటం వల్ల కండరాల కదలికలకు, నరాలు ఆరోగ్యంగా ఉండటానికి పొటాషియం కీలక పాత్ర పోషిస్తుంది.మనం తీసుకునే ఆహారంలో సరైన పొటాషియం మన శరీరానికి అందకపోవడం వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి.అందుకోసమే ప్రతిరోజు మనం తీసుకునే ఆహారంలో ఉప్పు శాతం తగ్గించి పొటాషియం అధికంగా ఉన్న ఆహార పదార్థాలను తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. పొటాషియం అధికంగా ఉండే ఆహార పదార్థాలు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం...

మన శరీరానికి సరిపడినంత పొటాషియం అందాలంటే ఎక్కువగా తాజా కూరగాయలు, పండ్లను తీసుకోవాలి. అరటి పండ్లు, బత్తాయి, మునగాకు, కొత్తిమిర, కొబ్బరి నీళ్ళలో పొటాషియం శాతం అధికంగా ఉంటుంది. అదేవిధంగా ఉల్లి, వెల్లుల్లి రోజువారి పరిమాణం కన్నా కాస్త ఎక్కువ మోతాదులో తీసుకోవడం వల్ల శరీరానికి కావల్సినంత క్యాల్షియం అందుతుంది. వీటితో పాటు డ్రై ఫ్రూట్స్ అధికంగా తీసుకోవడం వల్ల మన శరీరానికి సరిపోయే పొటాషియం అందుతుంది.

పొటాషియం లోపం వల్ల కలిగే అనర్ధాలు:

మనం తీసుకునే ఆహారంలో పొటాషియం శాతం తక్కువగా ఉంటే తీవ్ర అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. మన శరీరానికి తగినంత పొటాషియం అందకపోవటం వల్ల గుండె జబ్బులు రావడం, రక్తప్రసరణ సరిగ్గా జరగక పక్షవాతానికి దారితీస్తుందని పలు అధ్యయనాలలో వెల్లడయింది. పొటాషియం లోపంతో ఉన్నవారు తరచూ నీరసం, అలసటతో కనిపిస్తుంటారు. వీరు ఎలాంటి పనులను చేయడానికి కూడా ఇష్టపడరు.రక్తంలో పొటాషియం స్థాయి తక్కువగా ఉన్నవారికి విపరీతమైన కండరాల నొప్పులను కలిగి ఉంటాయి. మనం తీసుకున్న ఆహారం సరిగా జీర్ణం కాక మలబద్ధకానికి దారితీస్తుంది. అదేవిధంగా పొటాషియం తక్కువ అయినప్పుడు మన అరచేతులు అరికాళ్ళు మంటలు ఏర్పడి కొన్నిసార్లు స్పర్శ కూడా లేకుండా ఉంటుంది.ఇలాంటి సమస్యలన్నింటికీ అధిగమించాలంటే పొటాషియం ఎక్కువగా ఉన్నటువంటి ఆహార పదార్థాలను తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: