ముఖము బాగా మెరుపుగా, ప్రకాశవంతంగా ఉండాలనే కోరిక చాలా మందికి ఉంటుంది. దీన్ని సాధించుకోవడానికి మనం వాడే క్రీములు మరియు పౌడర్లు వాడినా కూడా ఒక మందంగా కనపడదు. అంతేకాకుండా రసాయనాలు  ఎక్కువగా ఉన్నా క్రీములు వాడటం వల్ల ముఖంపై సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అనేక సమస్యలు వస్తాయి. దీంతో ముఖము ఉన్న అందం కూడా పోగొట్టుకుంటారు. ముఖం  మీద ఉన్న మృత కణాలు తొలగిపోతాయి నే ముఖం  అందంగా కనిపిస్తుంది. మృత  కణాలను తొలగించడానికి కొన్ని చిట్కాలు పాటించడంవల్ల మృతకణాలు తొలగిపోయి ముఖం అందంగా కనబడుతుంది. ఆ చిట్కాల గురించి ఇప్పుడు చూద్దాం...

 ముఖం మీద ఉన్న డెడ్ స్కిన్ సెల్స్ ను తొలగించడానికి బొప్పాయి, చక్కెర బాగా ఉపయోగపడతాయి. బొప్పాయి ముక్కలు నేరెడ్ తీసుకొని బాగా నలిపి, అందులోకి ఒక స్పూన్ చక్కెర కలిపి ముఖానికి మసాజ్ చేసుకోవాలి. పదిహేను నిమిషాల తర్వాత ముఖం కడుక్కోవాలి. ఈ విధంగా వారంలో ఒకసారి చేయడం వల్ల మృత కణాలు వెంటనే తొలిగిపోతాయి.

 ఒక స్పూన్ తేనె, కాఫీ పౌడర్ తీసుకొని బాగా కలపాలి. అందులోకి 1 స్పూన్ నిమ్మరసం కలిపి ముఖానికి అప్లై చేసి ఇరవై నిమిషాల తర్వాత ముఖం కడుక్కోవాలి. ఇలా  రోజు చేయడం వల్ల ముఖం పై ఉన్న డెడ్ స్కిన్ సెల్స్ తొలగిపోతాయి.

 ఆలివ్ ఆయిల్ ఆరోగ్యానికి చాలా మంచిది. అంతేకాకుండా ముఖ సౌందర్యానికి కూడా ఉపయోగపడుతుంది. రెండు స్పూన్ల ఆలివ్ ఆయిల్ తీసుకొని ముఖానికి బాగా మసాజ్ చేయాలి. తర్వాత గోరువెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా వారంలో మూడు రోజులు చేయడం వల్ల ముఖం పై ఉండే మృతకణాలు తొలగిపోయి, ముఖం అందంగా కనిపిస్తుంది.

 రెండు స్ట్రాబెర్రీలను తీసుకొని మెత్తగా రుబ్బుకోవాలి. అందులోకి ఒక స్పూన్ తేనె, అర స్పూన్ నిమ్మరసం కలిపి ముఖానికి అప్లై చేసి ఇరవై నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడుక్కోవాలి. స్ట్రాబెరీ లో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది కొత్త కణాలను తొలగించడం. కానీ రంగుమారి ముఖం ప్రకాశవంతంగా ఉంటుంది.

 ఒక స్పూన్ సన్ ఫ్లవర్ ఆయిల్లో ఒక గుడ్డు కలిపి ముఖానికి బాగా మసాజ్ చేయాలి. ఇరవై నిమిషాల తర్వాత ముఖాన్ని  శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ముఖం మీద ఉన్న డెడ్ స్కిన్ సెల్స్ తొలగిపోయి ముఖం మందంగా కనబడుతుంది.

 ముఖం మీద ఉన్న డెడ్ స్కిన్ సెల్స్ ను తొలగించడానికి ఆపిల్ సైడర్ వెనిగర్ బాగా ఉపయోగపడుతుంది. ఒక టేబుల్ స్పూన్ ఆపిల్ సైడర్ వెనిగర్ తీసుకొని ముఖానికి అప్లై చేసి పది నిమిషాల తర్వాత ముఖం కడుక్కోవాలి ఇలా క్రమం తప్పకుండా చేయడం వల్ల ముఖం పై ఉన్న మృతకణాలు తొలగిపోతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: