భారతీయ సంప్రదాయపు వంటల్లో దాల్చినచెక్క అనేది అద్భుతమైన మసాలా దినుసు. దీనికి చాలా ప్రత్యేకతలు కూడా ఉన్నాయి. దాల్చిన చెక్క మంచి సువాసనను ఇవ్వడమే కాకుండా రుచిని కూడా అందిస్తుంది. వీటిని తీపి,కారం అయిన అన్ని రుచికరమైన వంటకాలు అన్నింటిలోనూ తప్పకుండా ఉపయోగిస్తారు. దాల్చిన చెక్కను కేవలం రుచి, సువాసన లకు మాత్రమే కాకుండా ఆరోగ్య ప్రయోజనాలను కూడా పెంపొందిస్తుంది. మనం తీసుకొనే ఆహారంలో ఒక విలువైన పదార్థంగా వ్యవహరించడమే కాకుండా ఫుడ్ పాయిజనింగ్ లాంటి సమస్యల నుంచి కాపాడుతుంది. అయితే దీనిని ఎలా తీసుకుంటే రోగనిరోధక శక్తి పెరుగుతుందో ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకుందాం.


అందుకు మీరు చేయాల్సిందల్లా ఒక గ్లాసు  నీటిలో దాల్చిన చెక్కను వేసి నానబెట్టాలి. రాత్రిపూట నానబెట్టి, ఉదయాన్నే ఈ నీటిని ప్రతి రోజు తాగడం వల్ల, ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. రోగనిరోధక శక్తి మెరుగుపడుతుంది. రాత్రంతా నానబెట్టిన దాల్చినచెక్క నీటిని ఉదయాన్నే తాగడం వల్ల ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్ పాలీఫెనాల్స్, ప్రోయాంతోసైనిన్లతో నిండి వుంటుంది. ఇవి రోగనిరోధక వ్యవస్థను మెరుగుపరిచేందుకు సహాయపడతాయి. యాంటీ వైరల్, యాంటీ బ్యాక్టీరియల్,యాంటీ ఫంగల్ లక్షణాలను కలిగి ఉంటుంది. శరీరంలో ప్రవేశించే చెడు బ్యాక్టీరియాతో పోరాడే శక్తి వీటికి ఉంది.


"నేషనల్ సెంటర్ ఫర్ బయోటెక్నాలజీ ఇన్ఫర్మేషన్" చేసిన ఒక అధ్యయనం ప్రకారం, మహిళలో రుతుక్రమం లో వచ్చే సమస్యలు తల నొప్పి,తిమ్మిర్లు రావడం, కడుపు నొప్పి, వాంతులు వంటి సమస్యల నుంచి బయట పడవచ్చు. అంతే కాకుండా దాల్చిన చెక్కను నానబెట్టిన నీరు తాగడం వల్ల మన శరీరంలోని ఇన్సులిన్ సున్నితత్వాన్ని కాపాడుకోవడానికి సహాయపడుతుంది. ఫలితంగా మధుమేహాన్ని నియంత్రించుకోవచ్చు.


కాబట్టి ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు కలిగిన దాల్చిన చెక్క నీటిని రోజూ తాగడం వల్ల ఆరోగ్యంగా ఉండవచ్చు. కాబట్టి మీరు కూడా ఈ దాల్చిన చెక్క నానబెట్టిన నీటిని ఉదయాన్నే తాగుతూ ఆరోగ్యమైన అద్భుత ప్రయోజనాలను పొందండి.

మరింత సమాచారం తెలుసుకోండి: