సాధారణంగా మొదటిసారి గర్భం దాల్చిన మహిళలలో ఎన్నో అనుమానాలు వ్యక్తమవుతుంటాయి. గర్భం దాల్చిన తర్వాత ఎలాంటి ఆహారాలు తీసుకోవాలి? ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి? ఏ పదార్థాలు తినవచ్చు? వేటిని తినకూడదు? అనే సందేహాలు ఎన్నో వస్తుంటాయి.అయితే ఈ ఆహార విషయంలో మన పెద్దవారు మనకు ఎన్నో సూచనలు చేస్తుంటారు. అయితే గర్భం దాల్చిన మహిళలు సాధారణంగా ఎంత బరువు ఉండాలి అనే సందేహం మరికొంతమందిలో బలంగా ఉంటుంది. గర్భం దాల్చిన మహిళలు ఎంత బరువు ఉండాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం...

సాధారణంగా గర్భం దాల్చాక ముందు మహిళలు వారి ఎత్తుకు తగ్గ బరువు ఉండాలి. ఉదాహరణకు వారి ఎత్తు 5.5 ఉన్నప్పుడు ఆ మహిళ సాధారణ బరువు 57_61 కేజీల మధ్యలో ఉండాలి.ఇలాంటి బరువు ఉన్నప్పుడు మాత్రమే గర్భందాల్చిన ఎటువంటి అనారోగ్య సమస్యలు తలెత్తకుండా తల్లీబిడ్డ క్షేమంగా ఉంటారు. అలా కాకుండా బరువు ఎక్కువగా ఉన్నప్పుడు వారిలో గర్భం దాల్చడానికి కూడా అవకాశాలు తక్కువగా ఉంటాయి. అధిక బరువు సమస్యతో బాధపడే వారిలో అండం సరిగా విడుదల కాదు, ఒకవేళ విడుదల అయినప్పటికీ అండం ఎదుగుదల లేకపోవడం వల్ల అబార్షన్ జరిగే అవకాశాలు ఉంటాయి. కనుక ఎత్తుకు తగ్గ బరువు ఉండటం ఎంతో అవసరం. అధిక బరువు సమస్యతో బాధపడేవారు గర్భం దాల్చడానికన్నా ముందు బరువు తగ్గడానికి ప్రయత్నించాలి.

గర్భం దాల్చాక కనీస బరువు ఎంత ఉండాలంటే:

ఒకవేళ గర్భం దాల్చిన మహిళలు గర్భందాల్చిన మొదటి నెల నుంచి తొమ్మిదో నెల వరకు నెలనెలా వారి బరువు పెరుగుతూ ఉండాలి. ఈ తొమ్మిది నెలలు కలిపి మహిళ దాదాపు 12 కిలోల బరువు పెరిగినట్లయితే వారి తల్లి బిడ్డ ఆరోగ్యం సురక్షితంగా ఉన్నట్టు. గర్భం దాల్చిన మొదటి నెలలో 60 కేజీలు ఉన్న మహిళ డెలివరీ సమయానికి 72 కేజీలు ఉన్నప్పుడు మాత్రమే తను ఆరోగ్యంగా ఉన్నట్టు. ఈ విధంగా బరువు పెరగాలంటే తప్పకుండా పౌష్టికాహారంతో పాటు, ఐరన్, క్యాల్షియం ఎక్కువగా లభించే వాటిని అదనంగా తీసుకోవాలి.ఈ విధంగా తరచూ జాగ్రత్తలను పాటిస్తూ పౌష్టికాహారం తీసుకున్నప్పుడు మాత్రమే బరువు సాధారణ స్థితిలో ఉండి తల్లి బిడ్డ ఆరోగ్యంగా ఉండగలరని నిపుణులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: