ఇప్పుడున్న జనరేషన్లో చిన్నవారి నుండి పెద్ద వారు వరకు కోపం సహజం. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ చిన్న విషయాలకే కోపం ఉంటారు. మరికొందరైతే వారికి తెలియకుండానే పక్కవారి మీద కోపాన్ని చూపిస్తుంటారు. ఇలా కోపం వల్ల ఎన్నో అనర్థాలకు దారి తీస్తుంది. ఈ కోపం తగ్గించు కోవాలంటే ఏం చేయాలి. చేపలు తినడం వల్ల కోపం తగ్గుతుందా దీని గురించి తెలుసుకుందాం..


 మనలో చాలా మంది మాకు తెలియకుండానే ఇతరుల పైన అరిచేస్తుంటారు. దానివల్ల మన చుట్టుపక్కల ఉన్న చాలామందికి మనం శత్రువులుగా మారుతాము. తరచుగా ఒత్తిడిని ఫీల్ అవ్వడం వల్ల కోపం పెరిగి పోతుంది. ఇలా కోపం రావడానికి కారణం మన శరీరంలో డీహెచ్ఏ తగ్గిపోవడమే కావచ్చు. ఇదే కారణం అయితే మీ కోపం ముందు ముందు తీవ్రరూపం దాల్చిన వచ్చు. డిహెచ్ఏ అంతే ఒమేగా 3 కొవ్వు ఆమ్లం ఇది మీ మానసిక స్థితి దూకుడు ధోరణులను నియంత్రిం చడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.


 ఇటీవల శత్రుత్వాన్ని డీహెచ్ఏ ఎంతవరకు ప్రభావితం చేస్తుందో చూడటానికి కొన్ని పరిశోధనలు జరిగాయి. ఈ అధ్యయనం వైద్య విద్యార్థులను వారి చివరి పరీక్షలలో అంచనా వేసింది. ఇందులో భాగంగా విద్యార్థులకు ప్లేసి బో లేదా షిప్ ఆయిల్ సప్లిమెంట్ ఇవ్వబడింది. ప్లేసిబో తీసుకున్న విద్యార్థులు దూకుడు స్థాయిని పెంచారు. ఇందులో తెలిసిన విషయం ఏమిటంటే హెచ్ఎం నేరుగా ఒత్తిడి ఆధారిత దూకుడును ప్రభావితం చేయదు గానీ, ఒమేగా 3 కొవ్వు ఆమ్లం తక్కువ ఉండటం అనేది వాస్తవానికి ప్రేరణ నియంత్రణ కోపంతో అనుసంధానించబడిన న్యూరోట్రాన్స్మిటార్లను తారుమారు చేస్తుంది.

 కాబట్టి పిల్లలతో సహా మానవులందరూ ఒమేగా 3 బలవర్థకమైన ఆహారం ద్వారా పొందవచ్చు. అంటే మీరు తినే ఆహారంలో చేపలు, సీఫుడ్లతో సహా  షిప్ ఆయిల్ సప్లిమెంట్లను తీసుకోవడం ద్వారా మీరు ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలను పొందవచ్చు. ప్రత్యేకంగా సాల్మన్,ట్యూనా, మాకేరెల్ వంటి కొవ్వు చేపలను ఎంచుకోండి. చేపలు ఇష్టపడనివారు గుల్లలు, మస్సేల్స్ నుండి పొందవచ్చు. ఇది మీ కోపం ఒత్తిడిని తగ్గించడానికి సహాయం చేయడమే కాకుండా, నిరాశను నివారించడానికి, మీ మెదడును  కార్యాచరణను మెరుగుపరచడానికి సహాయపడుతుంది. అంతేకాకుండా సాధారణంగా మానసిక ఆరోగ్య సమస్యల నుంచి కూడా మిమ్మల్ని కాపాడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: