మనలో ప్రతి ఒక్కరూ అందమైన ముఖంతో పాటు, అందమైన కురులు కూడా ఉండాలని కోరుకుంటారు. కొంతమంది అందమైన జుట్టు కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. మరికొందరు జుట్టు సరిగ్గా లేక బాధపడుతుంటారు. ఇంకొంతమంది అయితే ఉన్న జుట్టును ఎంతో భద్రంగా కాపాడుకుంటూ ఉంటారు. కానీ ఇప్పుడున్న జనరేషన్లో కాలుష్యం వల్ల అనేక సమస్యల వలన జుట్టు ఊడిపోవడం పెద్ద సమస్యగా మారిపోయింది. అలా జుట్టు ఊడిపోకుండా ఉండడానికి కొన్ని చిట్కాలు పాటించాలి. వాటి గురించి తెలుసుకుందాం.


 ప్రతి ఒక్కరూ అందమైన, ఆరోగ్యకరమైన జుట్టును కోరుకుంటారు. మన ఆహారపు అలవాట్లు, జీవన శైలి,నిద్ర షెడ్యూల్ గురించి సరైన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా మీ జుట్టును  కాపాడుకోవచ్చు. ఒక వ్యక్తి ఆరోగ్యం ఆ వ్యక్తి జుట్టు ఆకృతిని, జుట్టు పెరుగుదలను, జుట్టు ఆరోగ్యానికి నిర్ణయిస్తుంది. పని ఒత్తిడితో బాధపడుతున్న వ్యక్తులు ఎక్కువ జుట్టు రాలిపోతోందన్న సమస్య వింటుంటాం. వెంట్రుకలను బిగుతుగా వెనక్కి లాగి కట్టే పోనీ టెయిల్, హెయిర్ స్టైల్, వెంట్రుకలను బిగుతుగా పట్టి ఉంచే క్లిప్ ల వల్ల వెంట్రుకలు ఊడిపోతాయి .


 తరచుగా బ్యూటీ ట్రీట్మెంట్ లను వాడుతూ ఉన్న జుట్టు రాలిపోవడం జరుగుతుంది. మరికొందరు అందంగా ఉన్నా జుట్టు పలుచగా ఉండటం వల్ల విగ్ లను ఆశ్రయించాల్సి వస్తోంది. అలాంటి వారు జుట్టును ఎలా సంరక్షించుకోవాలి అనే విషయాలపై దృష్టి సారించాలి. జుట్టు విషయంలో మనం చేయకూడని కొన్ని పనులను గురించి  తెలుసుకుందాం. వెంట్రుకలు తాజాగా కనిపించడానికి చాలామంది ప్రతిరోజూ రోజుకు రెండుసార్లు వృద్ధులకు అడుగుతుంటారు. ఇలా జుట్టు ఎక్కువగా కడగడం  వల్ల జుట్టు సహజమైన నూనెలను పూయి నీరసంగా అనారోగ్యంగా  తయారవుతాయి. జుట్టును మనకు నచ్చిన విధంగా చేసుకోవడానికి హీటింగ్ టూల్స్ తరచుగా వాడుతుంటారు. ఇలా హీటింగ్ టూల్స్ వాడటం వలన వెంట్రుకల చివరలు చీలికలను గా ఏర్పడి చచ్చుబడి పోతాయి.


 వెంట్రుకలు తడిగా ఉన్నప్పుడు దువ్వెన లేదా బ్రష్ చేయకూడదు. వెంట్రుకలు దువ్వడానికి ముందు జుట్టు సహజంగా ఆగిపోయే వరకు వేచి ఉండాలి. తడి జుట్టును దువ్వెనతో చేయడంవల్ల వెంట్రుకలు పగిలిపోయి రాలిపోయే ప్రమాదం ఉంటుంది. కొంతమంది  కండిషనర్  అసలు ఉపయోగించరు. అది కూడా తప్పే. జుట్టుకు కండిషనర్ చాలా ముఖ్యం. జుట్టును టువాళ్లతో పొడి చేయడానికి ప్రయత్నించడం చాలా చెడ్డ పద్ధతి. టవల్తో గట్టిగా అదిమిపట్టి తుడవడం ద్వారా జుట్టు రాలిపోవడానికి దారితీస్తుంది.  హార్మోన్ల లోపం కారణంగా కూడా వెంట్రుకలు ఊడిపోతుంటాయి. మందుల ప్రభావం తో కూడా జుట్టు ఊడిపోతుంది. అద్దం లాంటి వాడినప్పుడు కూడా ఆ ప్రభావం జుట్టు పడుతుంది.  ఆహారపు అలవాట్లలో కూడా తప్పులు చేస్తే జుట్టు పై తీవ్ర ప్రభావం చూపుతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: