కొత్తిమీరను ప్రతి వంటకాల్లోనూ వాడతారు. ఎందుకంటే కొత్తిమీర వేయడం వల్ల రుచి,  వాసన వస్తాయి. కొత్తిమీరను మార్కెట్ కి వెళ్లి తీసుకు రావాల్సిన అవసరం కూడా ఉండదు. కొత్తిమీరను పెరట్లో కూడా పెంచుకోవచ్చు. కొత్తిమీరను వంటల్లో  కేవలము రుచి, వాసన కోసం వేసుకుంటా. కానీ కొత్తిమీరలో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి.  కొత్తిమీర తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం...

 నోటి దుర్వాసనను పోగొట్టడంలో కొత్తిమీర చాలా ఉపయోగపడుతుంది. నోటి దుర్వాసన పోవడానికి ఎన్ని పేజీలు వాడినా, నోటి దుర్వాసన మాత్రం పోవడం లేదు.  ఇలాంటి సమయంలో ధనియాలను నమలడం గాని, కొత్తిమీరను నమలడం వల్ల గాని నోటి దుర్వాసన నుంచి విముక్తి కలుగుతుంది.

 ఆహారంలో భాగంగా కొత్తిమీర ను చేర్చుకోవడం వల్ల శరీరంలో  ఎక్కువగా పేరుకుపోయిన కొలెస్ట్రాల్ను తగ్గిస్తుంది. అంతేకాకుండా చెడు కొలెస్ట్రాల్ను తగ్గించి, మంచి కొలెస్ట్రాల్ ను ఉత్పత్తి చేస్తుంది.

 కొత్తిమీరలో క్యాల్షియమ్, మినరల్స్ అధికంగా ఉండటం వల్ల ఎముకలు దృఢంగా ఉంటాయి.  అందుకే రోజూ ఆహారంలో భాగంగా కొత్తిమీర ను చేర్చుకోవాలి. అంతేకాకుండా బోన్ రీ గ్రోత్ కి తోడ్పడుతాయి. ఆస్టియోపొరోసిస్ ఈ సమస్యతో బాధపడుతున్న వాళ్లు ఈ రోజు కొత్తిమీర  తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

 హై బీపీ ఉన్నవాళ్లు కొత్తిమీరను సలాడ్ రూపంలో తీసుకోవడం వల్ల హైబీపీని కంట్రోల్ చేయవచ్చని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అంతేకాకుండా గుండె సమస్యలు రాకుండా ఉంటాయి.

 కొత్తిమీరను రోజు  ఆహారంలో తీసుకోవడం వల్ల జీర్ణ  వ్యవస్థ సక్రమంగా జరుగుతుంది. ఎందుకంటే కొత్తిమీర లో ఫైబర్ అధికంగా ఉంటుంది. అంతేకాకుండా అజీర్ణానికి, వికారానికి కొత్తిమీర చాలా బాగా దోహదపడుతుంది.

 కొత్తిమీరలో బీటా-కెరోటిన్ ఉండడంవల్ల వయస్సు మళ్ళిన వారిలో వచ్చే కంటిచూపును మెరుగుపరుస్తుంది. అంతేకాకుండా ఎలాంటి కంటి సమస్యలు రాకుండా కాపాడుతుంది.

 చర్మ సౌందర్యానికి కూడా కొత్తిమీర ఎంతో ఉపయోగపడుతుంది. చర్మం పొడిబారడం, ముడతలు పడడం వంటి సమస్యలను నివారిస్తుంది. కొత్తిమీరను అలోవెరా జెల్ తో కలిపి పేస్టులా చేసి దాన్ని ముఖానికి అప్లై చేయడం వల్ల ముఖము కాంతివంతంగా ఉండడమే కాకుండా మొటిమలు వంటివి తగ్గుతాయి.

 కొత్తిమీరను మెత్తగా  నూరి అందులోకి నిమ్మరసం కలిపి ముఖం మీద ఉన్న  బ్లాక్ హెడ్స్ పై పూయడం వల్ల బ్లాక్ హెడ్స్  తగ్గిపోతాయి. అంతేకాకుండా ముఖము అందంగా కనబడుతుంది.

 కొత్తిమీరలో యాంటీ ఆక్సిడెంట్,  యాంటీ ఫంగల్, యాంటీసెప్టిక్ ప్రాపర్టీ లు ఉండడంవల్ల అనేక చర్మ సమస్యలు రాకుండా ఇవి కాపాడుతాయి. అంతేకాకుండా   కొత్తిమీర రసాన్ని ముఖానికి అప్లై చేసి గంట తర్వాత కడిగేయడం వల్ల ముఖం  మీద ఉన్న ఆయిల్ ని తొలగించి చర్మం మృదువుగా ఉండేటట్లు చేస్తుంది.

 రెండు టీ స్పూన్లు కొత్తిమీర జ్యూస్ లో , ఒక టీస్పూన్  నిమ్మరసం కలిపి రాత్రి నిద్రపోయే ముందు పెదవులకు అప్లై చేయాలి. ఇలా వారం రోజులు చేయడంవల్ల పెదవులపై ఉన్న మృతకణాలు తొలగిపోయి పెదవులు మెరుస్తూ ఉంటాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: