రేగుపండ్లు అనగానే మనలో చాలామందికి గుర్తొచ్చేది సంక్రాంతి పండుగ. భోగి పండుగ రోజు భోగి పండ్లు అని చెప్పి, రేగు పండ్లు చిన్న పిల్లల తలపై పోస్తూ ఉంటారు. అయితే ఈ రేగు పండ్లను ఎందుకు పోస్తారు అంటే..? చిన్న పిల్లల మెదడు లో ఉండే నాళాలు, తలపై ఈ రేగుపండ్లు పడడం వల్ల అవి ఉత్తేజితమవుతాయి. ఫలితంగా జ్ఞాపక శక్తి పెరుగుతుంది అని  శాస్త్రం  తోపాటు సైన్స్ కూడా చెబుతోంది. అయితే రేగు పండ్లు ఎక్కువగా నవంబర్ నెలలో మొదలై.. జనవరి నెలలో ముగుస్తాయి.. అయితే ఈ రేగు పండ్లు తినడం వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయో ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకుందాం..


రేగు పండ్లలో ఎక్కువగా పొటాషియం, పాస్ఫరస్, మాంగనీస్,ఐరన్,జింక్ తదితర పోషకాలు ఉంటాయి. అంతేకాకుండా వీటిలో ఎన్నో రకాల మినరల్స్ కూడా మనకు పుష్కలంగా లభిస్తాయి.  రేగు పండ్లను తినడం వల్ల మెరుగైన రక్త ప్రసరణకు దోహదపడుతుంది. అలాగే వీటిలో ఉండే కాల్షియం ఎముకల దృఢత్వానికి ఉపయోగపడుతుంది.


ఇక రేగుపండ్లను దొరికే సీజన్లో సమృద్ధిగా తినడం వల్ల జుట్టు రాలడాన్ని అరికట్టవచ్చు.  అలాగే చర్మం ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడుతుంది. కండరాలు బలపడతాయి. హార్మోన్ల సమతాస్థితికి, శరీర ఎంజైములు ఏర్పడడానికి దోహదపడతాయి. చిన్న రేగు పండ్లలో ఉండే మినరల్స్ మన గుండె ఆరోగ్యంగా ఉండడానికి తోడ్పడతాయి.


రేగు పండ్లను తినడం వల్ల రక్త ప్రసరణ సాఫీగా జరుగుతుంది. ఇక ఎండిన రేగు పండులో క్యాల్షియం,  పాస్ఫరస్ ఎక్కువగా ఉండడం వల్ల  ఎముకలు దృఢం గా మారి, పటిష్టంగా తయారవుతాయి. రక్తంలో కీలకమైన హిమోగ్లోబిన్ పెరగాలంటే ఐరన్ ఎంతో అవసరం. అలాంటి ఐరన్ ఈ చిన్న రేగుపండ్ల లో పుష్కలంగా లభిస్తుంది. కాబట్టి రక్తహీనత సమస్యతో బాధపడేవారు ఈ రేగు పండ్లను తినడం ఉత్తమం. అలాగే కీళ్ల నొప్పులు, కాళ్ల నొప్పులు, వాపులు ఉన్నవారు రేగుపండ్లు తింటే వాటిల్లోని యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు వల్ల త్వరగా ఉపశమనం కలుగుతుంది. కాబట్టి వీలైనంత వరకు రేగుపండ్లను తింటూ ఉండాలి. అయితే వీటికి ఎలాంటి ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు. తక్కువ ధరకే ఎక్కువ మోతాదులో లభిస్తాయి..

మరింత సమాచారం తెలుసుకోండి: