భూమిపై అత్యంత ప్రాచుర్యం పొందిన రుచికరమైన మరియు పోషక విలువలు కలిగిన పండ్లలో యాపిల్ ఒకటి. ఈ ప్రకాశవంతమైన ఎరుపు రంగు ఆహారంలో ఒక ప్రత్యేకమైన తేజస్సు మరియు రహస్యం ఉంది. తీయని మరియుజ్యూసీ రుచితో ఒక సహజ దివ్యత్వాన్ని కలిగి ఉంది. రోజుకు ఒక ఆపిల్ తింటే చాలు డాక్టర్ అవసరం లేనట్లే. ఈ సమస్య మనందరికీ తెలిసిన విషయమే. అయితే మనలో చాలా మంది ఈ విషయాన్ని నమ్ముతారు ఆచరిస్తారు.


 ప్రపంచంలో అత్యధికంగా పండించే పంట మరియు ఎక్కువగా తినగలిగే హెల్త్ అండ్ న్యూట్రిషన్ ఫ్రూట్. ఒక విధంగా చెప్పాలంటే ఇందులోనే అద్భుతమైన ప్రయోజనాలను బట్టి ఇది ఒక అద్భుతమైన పండు అని చెప్పవచ్చు. ఎందుకంటే యాపిల్స్లో యాంటీఆక్సిడెంట్స్ మరియు వ్యాధులను వ్యతిరేకించే గుణాలు మెండుగా ఉన్నాయి. ఇంకా యాపిల్ లో పెక్టీన్ వంటి ఫైబర్ పుష్కలంగా ఉంది . యాపిల్స్ లో ఉండే ఫైటో న్యూట్రిషియన్స్ మరియు యాంటీఆక్సిడెంట్స్ క్యాన్సర్ రిస్క్ను హైపర్ టెన్షన్ డయాబెటిస్ మరియు హాట్ సమస్యలు నివారిస్తుంది.



 యాపిల్ ఆరోగ్యానికే కాకుండా అందానికి కూడా ఉపయోగపడుతుంది. అది ఎలాగో తెలుసుకుందాం. ఆరోగ్యానికి ఆపిల్ మేలు చేస్తుందన్న సంగతి అందరికి తెలిసిందే. దీంతో అందానికి మెరుగులు దిద్దుకోవచ్చు. చర్మం పై జిడ్డు పొడి సాధారణ చర్మం ఏదైనా కావచ్చు ఈ పూతను ప్రయత్నిస్తే ముఖం చక్కగా కాంతులీనుతుంది. చెంచా యాపిల్ గుజ్జులో అర చెంచా తేనె వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసి పావుగంట తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.


 ఇక ముఖం బాగా మెరవాలంటే రెండు చెంచాల యాపిల్ గుజ్జులో చెంచా చొప్పున దానిమ్మ రసం, పెరుగు వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పూతలా వేయాలి. బాగా ఆరిన తర్వాత నీళ్లతో కడిగేయాలి. దీంట్లో యాంటీ ఆక్సిడెంట్లు యాంటి మైక్రోబియల్, యాంటీ ఏజింగ్ లక్షణాలు కొత్త కణాల ఉత్పత్తి తోడ్పడతాయి. దాంతో ముఖం ప్రకాశవంతంగా మారుతుంది. మూడు చెంచాల యాపిల్ పేస్టులో, చెంచా పాలు, గుడ్డు తెల్ల సొన వేసి బాగా కలపాలి. దీన్ని ముఖం మెడకు రాసి 20 నిమిషాల పాటు అలాగే వదిలేయాలి. ఆ తర్వాత గోరు వెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి ఒకసారి చేస్తే తేడాను మీరే గమనించవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: