వాతావరణంలో రోజురోజుకీ వాయు కాలుష్యం పెరిగిపోతోంది. వాయు కాలుష్యం ఒకప్పుడు పట్టణాలు నగరాల ప్రాంతాల్లో ఎక్కువగా ఉండేది. కానీ ఇప్పుడు పల్లెటూర్లలో కూడా వాయు కాలుష్యం పెరిగిపోతోంది. ప్రతి ఒక్కరూ గ్రామీణ ప్రాంతాల నుండి ఉపాధి అవకాశాల కోసం పట్టణ ప్రాంతాలకు వలసలు అసలు వెళ్తున్నారు. దీనితో పట్టణ ప్రాంతాల్లో జనాభా అపరిమితంగా పెరుగుతోంది. తాజాగా కొన్ని అధ్యయనాల్లో వాయు కాలుష్యం వల్ల దేశంలో 66 కోట్ల మంది ఆయుష్షు సగటున మూడు సంవత్సరాలు తగ్గుతోంది.



 అందులో అత్యధికంగా పట్టణ ప్రాంతాల్లో ఉండే వారు ఉన్నారు. వాయు కాలుష్యం వల్ల ఆయుష్షు తగ్గడమే కాకుండా పనిలో సామర్థ్యం ఉత్పాదకత తగ్గిపోతున్నాయి. అనారోగ్యం వైద్య ఖర్చులు పెరిగిపోతున్నాయి. పారిశ్రామిక తాళ్లతో ,వాహనాలు వెలువరించే విష  వాయువులతో, పచ్చదనాన్ని మింగేస్తూ విస్తరిస్తున్న కాంక్రీట్ నిర్మాణాలతో ప్లాస్టిక్ తదితర చెత్త కాల్చివేత లతో పట్టణ ప్రాంతాల్లో కాలుష్య కాసారాలుగా అవుతున్నాయి. మనిషి జీవితం అత్యంత దుర్భరంగా తయారవుతుంది.


 తినే తిండి విషయంలో శ్రద్ధ పెరిగింది, తాగే నీటి విషయంలో మరింత జాగ్రత్త పడుతున్నాం. కానీ డీజే గాలి విషయంలో మనకు ఇంకా స్పృహ రాలేదు. నిజానికి, తినే తిండి కన్నా, తాగే నీటి కన్నా, మనం పీల్చే గాలి విషపూరితమైనది. వాయు కాలుష్యం ఆరోగ్యానికి అత్యంత ప్రమాదకారిగా మారిన క్రమంలో తాజా పరిశోధన ప్రపంచ జనాభా ను కలవరపెడుతోంది. కాలుష్య స్థాయి తక్కువగా ఉన్న దీర్ఘకాలం ఎక్స్ పోజ్ అయితే అది ప్రాణాంతకంగా పరిణమిస్తుంది అని నిపుణులు హెచ్చరిస్తున్నారు.


 గుండె ఊపిరితిత్తుల వైఫల్యానికి దారి తీస్తుంది అని తాజా సర్వే హెచ్చరించింది. రెండు వేల నుంచి 2016 వరకూ 6.3 కోట్ల మంది వైద్య రికార్డులను పరిశీలించి తాజా సర్వే తల అంశాలను తెరపైకి ఎక్కించింది. పరిమిత స్థాయి కాలుష్యానికి అయినా దీర్ఘకాలం ఎక్కువ అయితే న్యూమోనియా, హార్ట్ ఎటాక్, స్ట్రోక్ వంటి తీవ్ర అనారోగ్యానికి దారితీస్తుంది అని ఈ పరిశోధన హెచ్చరించింది. వయోధికులు లో ఈ రిస్క్ మరింత అధికమయ్యే జర్నల్ సర్కులేషన్ లో ప్రచురితమైన అధ్యయనం స్పష్టం చేసింది. గాలిలో పర్టికులర్ మ్యాటర్, నైట్రోజన్ డయాక్సైడ్, ఓజోన్ వంటి పలు అంశాల ఆధారంగా పరిశోధకులు తాజా అధ్యయనం చేపట్టారు. ఇక నైట్రోజన్ డయాక్సైడ్ ను దీర్ఘకాలం ఎక్స్పోజ్ అయితే గుండె జబ్బులు స్ట్రోక్ ముప్పు అధికమని అధ్యయనం పేర్కొంది. గుండె ఊపిరితిత్తుల జబ్బులకు వాయు కాలుష్యం ప్రధాన ఫ్యాక్టరీ గా గుర్తించాలని అధ్యయనం  స్పష్టం చేస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: