గొంతులో కిచ్ కిచ్ గా ఉంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. మాటిమాటికీ కఫం వస్తూనే ఉంటుంది. దాన్ని  ఉమ్మి వేయడానికి కష్టంగా ఉంటుంది. కొంతమంది ఉమ్మి లేకుండా అలానే మింగుతూ ఉంటారు. ఇలా చేయడం చాలా ప్రమాదకరం. వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్నప్పుడు కఫం ఏర్పడుతుంది. అది గొంతుకు అడ్డం పడుతుంది. దీనివల్ల జలుబు, దగ్గు, జ్వరం, అలర్జీలు, కాలుష్యం, పొగ వంటివన్నీ గొంతు గరగర కు దారితీస్తాయి. వీటివల్ల దగ్గు రెండు వారాల కన్నా ఎక్కువగా అంటే ప్రాణాంతకమైన ఛాయా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి గొంతు కిచ్ కిచ్ నయం కావడానికి కొన్ని వంటింటి చిట్కాలు ఉపయోగించడం వల్ల వాటిని తగ్గించవచ్చు.ఆ చిట్కాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం...

 గొంతులో కిచ్ కిచ్ అని తగ్గించడానికి అల్లం, దాల్చిన చెక్క బాగా ఉపయోగపడతాయి. అల్లం ని పేస్టులా చేసి అందులో కి దాల్చిన చెక్క పొడి వేసి టీ తయారు చేసుకుని అందులోకి  కొంచెం తేనె కలిపి రోజుకు రెండు మూడు సార్లు తాగడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

 గొంతులో గరగర ఉన్నప్పుడు గోరువెచ్చని పాలల్లో టీ స్పూన్ పసుపు పొడి కలుపుకొని, కాస్త నెయ్యి వేసుకొని తాగడం వల్ల గొంతు గరగర తగ్గి,గొంతులో హాయిగా ఉంటుంది.

 కొద్దిగా పుదీనా ఆకులను తీసుకొని నీటిలో వేసి బాగా మరగనివ్వాలి. ఆ నీరు గోరువెచ్చగా ఉన్నప్పుడు తాగడం వల్ల గొంతులో గర గర  తగ్గడమే కాకుండా, కఫం రాకుండా ఉంటుంది.

 కొన్ని చామంతి రేకులను నీటిలో వేసి బాగా మరగనివ్వాలి. ఇందులో  కొంచెం తేనె కలుపుకొని తాగడం వల్ల గొంతులో ఉండే బ్యాక్టీరియాను చంపుతుంది. దీనివల్ల గొంతు హాయిగా ఉంటుంది.

 గొంతు కిచ్ కిచ్ మాయమవ్వాలంటే అల్లం టీ బాగా పనిచేస్తుంది. అంటే అల్లంలో బ్యాక్టీరియాలను చంపే గుణాలు ఉంటాయి.  అందుకే అల్లం మెత్తగా దంచి నీటిలో వేసి ఐదు నిమిషాలు  మరగనివ్వాలి. ఆ తర్వాత తాగడం వల్ల గొంతు కిచ్ కిచ్ తగ్గిపోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: