గత ఏడాది కరోనా వల్ల ఎంతో మంది ప్రాణాలను కోల్పోయారు. చాలా మంది కరోనా వైరస్ నుంచి కోలుకున్నారు. అయితే కోవిడ్ నుంచి కోరుకున్న వారికి జుట్టు ఊడిపోతుంది అట.కరోనా వైరస్ మహమ్మారి వెలుగు చూసి సంవత్సరం దాటిపోయింది. దీని మూలాలు లక్షణాలు వ్యాప్తి  పై ఇంకా పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. వైరస్ స్ట్రెయిన్ దీర్ఘకాలిక లక్షణాలు వైరస్ దుష్ప్రభావాల పై చేస్తున్న అధ్యయనాల్లో ఎప్పటికప్పుడు కొత్త విషయాలు తెలుస్తున్నాయి.

కోవిడ్ 19 దీర్ఘకాలిక వ్యాధి లక్షణాల్లో జుట్టు రాలిపోవడం కూడా ఉంటుందట ఇటీవల చేసిన పరిశోధనలు వెల్లడించాయి. కరోనా బారిన పడి చికిత్స తీసుకున్నవారిలో దుష్ప్రభావాలు కొన్ని నెలల వరకు కొనసాగుతూ ఉన్నాయి. దీన్ని లాంగ్ కోవిడ్ అని పిలుస్తారు. లాంగ్ కోవిడ్ 5 ప్రధాన లక్షణాల్లో జుట్టురాలిపోవడం ఒకటని పరిశోధకుడు తెలిపారు. మహమ్మారి దీర్ఘకాలిక ప్రభావాలు ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తోంది . కొంతమంది కోవిడ్ రోగుల్లో కరోనా వచ్చి కోలుకున్న కొన్ని వారాలు నెలల తర్వాత కూడా దుష్ప్రభావాలు కనిపిస్తున్నాయి.


 వైరస్ లక్షణాలు 8 వారాల కంటే ఎక్కువ కాలం కొనసాగితే లాంగ్ కోవిడ్  గా గుర్తిస్తున్నారు. అయితే ప్రతి ఐదుగురు  కరోనా వైరస్ రోగుల్లో 15 వారాలు లేదా అంతకంటే ఎక్కువ కాలం వ్యాధి లక్షణాలు కనిపి స్తున్నాయని బ్రిటన్ లోని ఆఫీస్ ఫర్ నేషనల్ స్టాటిస్టిక్స్ సంస్థ వెల్లడించింది. కోవిడ్ నుంచి కోరుకున్న వారిలో ఆరు నెలల తర్వాత కూడా వైరస్ లక్షణాలు కనిపిస్తున్నాయని లాన్సెట్ అధ్యయనం చెబుతోంది.


 ఇందులో జుట్టు తాగడం ఆందోళన కలిగించే ప్రధానాంశంగా ఉందని అధ్యయనం పేర్కొంది. ఆడవాళ్లలో ఎక్కువ జుట్టు రాలిపోవడానికి ఎన్నో కారణాలు ఉండవచ్చు. కానీ కరోనా వైరస్ వల్ల కూడా ఈ సమస్య ఎదురవుతుందని కొన్ని అధ్యయనాలు కనుగొన్నాయి. ఇది లాంగ్ కోవిడ్ లక్షణంగా మారుతుంది. కోవిడ్ నుంచి కోలుకున్న వారిలో పావువంతు మంది లో జుట్టు ఊడిపోయి సమస్య ఎక్కువ అవుతుందని లాన్సెట్ జర్నల్ లో ప్రచురించిన ఒక అధ్యయనం వెల్లడించింది. జుట్టు రాలిపోవడం తో పాటు అలసట కండరాల బలహీనత నిద్రలేమి ఒత్తిడి ఆందోళన వంటి లక్షణాలు కూడా వీరిలో కనిపిస్తున్నాయని అధ్యయనంలో కనుగొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: